News December 15, 2025

HYD: న్యూ ఇయర్ కోసం వెయిటింగా? మీకోసమే

image

HYD న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. DEC 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1 వరకు పబ్‌లు, బార్‌లు, హోటళ్లలో CCకెమెరాలు, సెక్యూరిటీ తప్పనిసరి. మైనర్లకు ఎంట్రీ, మద్యం నిషేధం, డీజేలు, అశ్లీల నృత్యాలు, రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బ్యాన్. మద్యం తాగి వాహనం నడిపితే కేసులు, జరిమానా, జైలు శిక్ష విధిస్తామని CP సజ్జనార్ హెచ్చరించారు. న్యూ ఇయర్ ఈవెంట్లు రాత్రి 12:30లోపు ముగించాలన్నారు.

Similar News

News January 17, 2026

గచ్చిబౌలిలో రిజిస్ట్రేషన్ ఉంటేనే ఎంట్రీ!

image

గచ్చిబౌలి స్టేడియం వేదికగా నేడు పర్యాటక శాఖ నిర్వహించే ‘డ్రోన్ షో’కు సర్వం సిద్ధమైంది. ముందస్తుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రవేశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే స్లాట్లన్నీ నిండిపోయినందున, రిజిస్ట్రేషన్ లేని వారు స్టేడియం వద్దకు రావొద్దని కోరారు. ఆ విన్యాసాలను మిస్ కాకుండా ఉండటానికి పర్యాటక శాఖ అందించే లైవ్ లింక్ ద్వారా వీక్షించాలని విజ్ఞప్తి చేశారు.

News January 17, 2026

సీఎం రూట్ అని తెలిసినా వినలేదు.. కేసు నమోదు

image

సీఎం రూట్ ఉన్న విషయం తెలిసి కూడా జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్ యజమాని అక్రమ పార్కింగ్లు చేశాడంటూ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని ఫ్యాట్ పిజీయన్ పబ్ నిర్వాహకులు సీఎం రూట్ ఉందని చెప్పినా వినిపించుకోకుండా తమ కస్టమర్లతో వాహనాలను పార్కింగ్ చేయించడంతో సీఎం రూట్‌లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పబ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 17, 2026

HYD: ఫేక్ టాబ్లెట్ గుర్తుపట్టడం ఎలా..?

image

HYDలో పలుచోట్ల నకిలీ మందులు విక్రయిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మందులు కొనుగోలు చేసే సమయంలో స్ట్రిప్‌‌పై బ్యాచ్ నంబర్, తయారీ, గడువు తేదీలు, కంపెనీ పేరు స్పష్టంగా ఉన్నాయా..? చూడాలి. బిల్ తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమానం వస్తే DGCA వెబ్‌సైట్‌లో బ్యాచ్ వివరాలు చెక్ చేయాలి. ఫిర్యాదులకు 18005996969 నంబర్‌కు కాల్ చేయండి.