News December 15, 2025

MDK: సర్పంచ్ ఎన్నికల్లో అన్నాచెల్లెళ్ల గెలుపు!

image

మెదక్ జిల్లా రేగోడ్ మండలంలో అన్నాచెల్లెళ్లు సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. కొండాపూర్ గ్రామ సర్పంచ్‌గా అన్న బేగరి పండరి గెలుపొందారు. అదే మండలంలోని కొత్వాల్ పల్లిలో చెల్లెలు మాల సంగమ్మ సర్పంచ్‌గా నేరుగా బరిలో నిలిచి ప్రజాభిమానంతో గెలుపొందారు. వేర్వేరు గ్రామాల నుంచి సొంత అన్నాచెల్లెళ్లు విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.

Similar News

News March 13, 2026

మొజ్తబా ఓ కీలుబొమ్మ: నెతన్యాహు

image

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని ఇజ్రాయెల్ PM నెతన్యాహు విమర్శించారు. ఆయన రివల్యూషనరీ గార్డ్స్ కీలుబొమ్మ అని, బయటకు కూడా రాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు చెందిన టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ మరణించారని తెలిపారు. ‘ఇరాన్ ప్రజలు స్వేచ్ఛా మార్గం వైపు అడుగులు వేసే సమయం వచ్చింది. మేం వారికి అండగా ఉంటాం. కానీ మార్పు మాత్రం వారి చేతుల్లోనే ఉంది’ అని పేర్కొన్నారు.

News March 13, 2026

బాపట్ల: అనుమానంతో పెళ్లి నిరాకరణ.. తల్లీకూతురి ఆత్మహత్య

image

మార్టూరు మండలం ద్రోణాదులలో తల్లీకూతుళ్లు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం కలిగించింది. సిరికొండ దివ్యకు మార్టూరుకు చెందిన రావులకొల్లు శేషుబాబుతో గతేడాది డిసెంబర్ 14న ఎంగేజ్మెంట్ జరిగింది. దివ్యను అనుమానించిన శేషుబాబు పెళ్లికి నిరాకరించాడు. దీంతో మనస్థాపానికి గురైన తల్లీకూతుర్లు దివ్య, సుజాత ఈనెల 4న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గుంటూరులో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు.

News March 13, 2026

దేశంలోనే భద్రాద్రి టాప్..!

image

దేశంలోనే అత్యధికంగా భద్రాద్రి పోలీసులు ఏడాది కాలంలో 6500 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. పట్టుబడిన నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేయడమే కాకుండా వారి ఆస్తులను జప్తు చేయడం జరుగుతుందని తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండలో జరిగిన అవేర్నెస్ ప్రోగ్రాంలో మాట్లాడారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని, ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరాలన్నారు.