News December 15, 2025

వికారాబాద్ జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

వికారాబాద్ జిల్లాలో రెండో విడతలో 7 మండలాల్లో 175 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 87.77% పోలింగ్ నమోదు కాగా, వికారాబాద్ మండలంలో అత్యధికంగా 87.77శాతం, అత్యల్పంగా బంట్వారం మండలంలో 80.25శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. 7 మండలాల్లో 2,09,847 మంది ఓటర్లు ఉండగా 1,73,594 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు వెల్లడించారు.

Similar News

News April 8, 2026

వర్షపు నీటి సంరక్షణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జలధార–జలహారతి కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. వర్షపు నీటి సంరక్షణకు చెరువులు, కాలువలు అనుసంధానం చేయాలని సూచించారు. 100 రోజుల ప్రత్యేక ప్రణాళికతో పనులు చేపట్టి భూగర్భ జలాలు పెంచాలని తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి సమన్వయంతో కార్యక్రమాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు.

News April 8, 2026

సచివాలయాల్లో ప్రజలకు అందతున్న సేవలపై కలెక్టర్ ఆరా

image

సచివాలయ సేవల్లో వేగం, పారదర్శకతకు ప్రాధాన్యమిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. పెద్దమండెం మండలం కోటకాడపల్లె గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. సచివాలయంలోని శాఖల వారీగా కార్యదర్శులున్నారా? సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణ, వినతులు, ఫిర్యాదుల పరిష్కార విధానంపై ఆరా తీశారు. సచివాలయ సేవలు వేగవంతమవ్వాలని సిబ్బందికి సూచించారు.

News April 8, 2026

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకు..

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘గంగోత్రి’ నుంచి ‘పుష్ప-2’ వరకు వైవిధ్యమైన సినిమాలతో మెప్పించారు. ‘వరుడు’, ‘వేదం’ చిత్రాల్లో బెస్ట్ సాంగ్స్, బలమైన కథాంశం ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ‘ఆర్య’, ‘అల వైకుంఠపురములో’ వంటి సినిమాలు క్లాసిక్ హిట్స్‌గా నిలిచాయి. ప్రతి సినిమాలోనూ తనదైన మేనరిజం, డాన్స్‌తో ప్రేక్షకులను అలరించడం ఆయన ప్రత్యేకత. ఆయన నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి.