News April 20, 2024
BREAKING: చరిత్ర సృష్టించిన SRH

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీ20లో చరిత్ర సృష్టించింది. పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా నిలిచింది. 6 ఓవర్లలో ఏకంగా 125 రన్స్ చేసింది. ఢిల్లీతో మ్యాచులో హైదరాబాద్ ఓపెనర్లు హెడ్(84*), అభిషేక్(40*) ఈ ఘనత సాధించారు. గతంలో ఈ రికార్డు KKR పేరిట ఉంది. 2017లో ఆ టీమ్ RCBపై 105 రన్స్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డును SRH బద్దలుకొట్టింది.
Similar News
News March 19, 2026
TODAY HEADLINES

✏ ఏపీలో ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం
✏ 2029లో BRS ఎలా గెలుస్తుందో చూస్తా: సీఎం రేవంత్
✏ తెలంగాణలో రికార్డు స్థాయిలో గ్యాస్ డెలివరీలు
✏ జగన్ లాంటి అన్న ఉంటే శత్రువులు అవసరం లేదు: షర్మిల
✏ డొమెస్టిక్ LPG ఉత్పత్తి 40% పెరిగింది: కేంద్రం
✏ గల్ఫ్ దేశాల్లోని పెట్రోకెమికల్ ఫెసిలిటీస్‌పై దాడులు చేస్తాం: ఇరాన్ హెచ్చరిక
✏ ఐపీఎల్: SRH కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
News March 19, 2026
కమిన్స్ దూరం.. SRHకు బౌలింగ్ కష్టాలు?

IPL2026లో కొన్ని మ్యాచులకు కమిన్స్ దూరం కానున్నట్లు SRH ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌లో స్ట్రాంగ్ ఉన్న ఆ టీమ్ బౌలింగ్‌లో వీక్‌గా కనిపిస్తోంది. కమిన్స్ లేకపోవడంతో మరింత బలహీనంగా మారింది. దీంతో పేస్ బాధ్యతలు ఉనద్కత్, హర్షల్, శివమ్ మావి మోయాల్సిన పరిస్థితి ఉంది. కానీ వారు రాణించేది అనుమానమే. అటు స్పిన్నర్లలో అనుభవజ్ఞులు లేరు. దీంతో ఈసారి కూడా జట్టు భారం మొత్తం బ్యాటర్లే మోయాల్సి రావొచ్చు.
News March 19, 2026
ఇకపై గల్ఫ్‌కు లోకల్ కరెన్సీల్లోనే చెల్లింపులు?

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇకపై గల్ఫ్ దేశాలతో వాణిజ్యం లోకల్ కరెన్సీలతో సెటిల్ చేసుకునే అంశాన్ని భారత్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అనిశ్చితి వల్ల పెరుగుతున్న దిగుమతి భారానికి చెక్ పెట్టాలని కేంద్రం భావిస్తోంది. చెల్లింపులు మన రూపీ లేదా గల్ఫ్ దేశాల కరెన్సీలో చేయడం వల్ల డాలర్‌పై ఆధారపడటం తగ్గుతుందని, ఫలితంగా డాలర్ వల్ల కలిగే కన్వర్షన్ కాస్ట్ భారం కూడా ఉండదని అధికారులు చెబుతున్నారు.


