News December 15, 2025

NZB: రాత్రి వరకు కొనసాగిన GP ఎన్నికల కౌంటింగ్

image

నిజామాబాద్ జిల్లాలోని 8 మండలాల్లో ఆదివారం జరిగిన GP ఎన్నికల కౌంటింగ్ కొన్ని మేజర్ గ్రామ పంచాయతీల్లో రాత్రి వరకు కొనసాగింది. చిన్న GPల్లో సాయంత్రం సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కాగా 158 సర్పంచ్ స్థానాలకు 568 మంది, 1,081 వార్డులకు 2,634 మంది పోటీలో నిలవగా మొత్తం 2,38,838 మంది ఓటర్లకు గాను 1,83,219 మంది (76.71 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Similar News

News January 17, 2026

నిజామాబాద్‌లో సైబర్ మోసం

image

NZB పూసలగల్లి వాసి ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.1.10 లక్షల మోసానికి గురయ్యాడు. లాభాలు గడించే సూచనలు చేసేందుకు రూ.3 వేలు చెల్లించి తమ గ్రూపులో చేరాలని మెస్సేజ్ వచ్చింది. డబ్బులు చెల్లించగా సైబర్ నేరగాళ్లు అతడి ఫోన్‌కు ఒక QR కోడ్ పంపించి, దాన్ని స్కాన్ చేస్తే మెళుకువలు తెలుస్తాయన్నారు. అది స్కాన్ చేయగానే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News January 17, 2026

NZB: మందుగుండు పేలి ఆవు మృతి

image

వన్యప్రాణుల వేట కోసం దుండగులు వేసిన ఉచ్చు ఒక పాడిఆవు ప్రాణాలను బలితీసుకుంది. రెంజల్ మండలం దూపల్లికి చెందిన కారె సాయికుమార్ అనే రైతు తన ఆవును మేత కోసం జాన్కంపేట్ శివారులోకి తీసుకెళ్లారు. అడవిపందుల కోసం పేలుడు మందును పశువులకు పెట్టే తవుడులో ముద్దలుగా చేసి ఉంచారు. మేత మేస్తున్న క్రమంలో ఆవు ఆ తవుడు ముద్దను తినగానే ఒక్కసారిగా నోట్లోనే పేలుడు సంభవించి ఆవు నోటిభాగం తీవ్రంగా ఛిద్రమై మృతి చెందింది.

News January 17, 2026

NZB: ఆశవాహుల్లో ఉత్కంఠ

image

నిజామాబాద్ నగర పాలక సంస్థతోపాటు భీంగల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల వార్డులకు శనివారం మహిళా రిజర్వేషన్లను ప్రకటించనున్న నేపథ్యంలో పోటీ చేసే ఆశావహుల్లో ఉత్కంఠత నెలకొంది. ఏ స్థానం ఎవరికి రిజర్వు అవుతుందోనని కార్పొరేటర్, కౌన్సిలర్ ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అధికార కాంగ్రెస్, BJP, BRSపార్టీల నేతలు తమ వారిని నిలబెట్టించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.