News December 15, 2025
చిత్తూరు జిల్లాలో ఘోరం..!

చిత్తూరు మండలం తుమ్మిందకు చెందిన బాబు ప్రైవేట్ స్కూల్ వ్యాన్ డ్రైవర్. అతని భార్య కవిత ఆ బస్సులోనే హెల్పర్‌గా పనిచేస్తున్నారు. కవితకు ఇటీవల రూపేశ్ అనే వ్యక్తి పరిచయం కావడంతో బంగారు నగలు ఇచ్చింది. వాటిని అతను తిరిగి ఇవ్వలేనని చెప్పాడు. నగల విషయమై శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన కవిత తన కుమారుడు ముఖేష్(4)తో కలిసి గ్రామ సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.
Similar News
News April 16, 2026
కుప్పం: మళ్లీ నల్లకోటు వేసిన రెడ్డప్ప

చిత్తూరు మాజీ MP, వైసీపీ సీనియర్ నేత రెడ్డప్ప మళ్లీ నల్లకోటు ధరించి కుప్పం కోర్టుకు హాజరయ్యారు. మాజీ CM జగన్ CPRO శ్రీహరిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. YCP లీగల్ సెల్ పొన్నువోలు సుధాకర్ రెడ్డితోపాటు చిత్తూరు మాజీ MP రెడ్డప్ప శ్రీహరి తరపున వాదించేందుకు వచ్చారు. ఖద్దర్ చొక్కాలో కనిపించే రెడ్డప్ప నల్లకోటు ధరించి రావడంతో ఆయనతో వైసీపీ శ్రేణులు సెల్ఫీలు తీసుకున్నాయి.
News April 15, 2026
BIG BREAKING ఇంటర్ ఫలితాలు.. వెనుకబడ్డ చిత్తూరు

ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. <<19653702>>ఫస్టియర్‌లో చిత్తూరు జిల్లా నుంచి 1<<>>2,567 మంది పరీక్ష రాయగా 8,691మంది పాసయ్యారు. 69 % పాస్ మార్కులతో జిల్లా 22 వ స్థానంలో నిలిచింది. అలాగే సెకండియర్‌కు 11,651 మంది పరీక్షలు రాయగా 8,280 మంది పాసయ్యారు. 71% పాస్ మార్కులతో చిత్తూరు 24 వ ప్లేస్ దక్కించుకుంది.