News April 20, 2024

చిత్తూరు: కారు- బైక్ ఢీ

image

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలైన సంఘటన నిమ్మనపల్లి మండలంలో జరిగింది. స్థానిక ఇందిరమ్మ కాలనీ వద్ద రాయచోటి నుంచి పీలేరు వైపు కారు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్‌ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు షౌకత్ ఆలీకి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం పీలేరు తరలించారు.

Similar News

News March 15, 2026

కాణిపాకం: 17న అత్యవసర ధర్మకర్తల మండలి సమావేశం

image

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 17న ఉదయం 10:30 గంటలకు అత్యవసర ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి పెంచల కిశోర్ తెలిపారు. యుద్ధ పరిస్థితులు, అవసరమైన సరుకుల సరఫరా, ప్రసాదానికి ఉపయోగించే గ్యాస్ సరఫరా సంబంధిత ఏర్పాట్లపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశానికి ధర్మకర్తల మండలి ఛైర్మెన్, సభ్యులు, అధికారులు హాజరుకావాలని వారు కోరారు.

News March 15, 2026

చిత్తూరు: పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

image

జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు ఆదివారం తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. వారికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరిసర ప్రాంతాలలో ఎవరు గుంపులు గుంపులుగా రాదని, జెరాక్స్ సెంటర్లు తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు.

News March 15, 2026

చిత్తూరు: ‘గ్యాస్ కష్టాలు ఉంటే కాల్ చేయండి’

image

జిల్లాలో వంట గ్యాస్ సరఫరా సజావుగా సాగుతోందని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని JC ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. గ్యాస్ సరఫరాపై వినియోగదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్యాస్ సరఫరాకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు, సందేహాలు ఉంటే (ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) 08572-242734 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.