News December 15, 2025

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో ఉద్యోగాలు

image

<>టాటా<<>> ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌ 7 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు JAN 3 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, NTC, సైన్స్ గ్రాడ్యుయేట్(ఫిజిక్స్, ఇంజినీరింగ్ ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/రేడియో ఫిజిక్స్), డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ట్రేడ్/స్కిల్ టెస్ట్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.tifr.res.in

Similar News

News March 9, 2026

వంటగ్యాస్ బుకింగ్ పీరియడ్ 25 రోజులకు పెంపు

image

గ్యాస్ సిలిండర్ల హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బుకింగ్ పీరియడ్‌ను 21 నుంచి 25 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కొందరు గతంలో 55 రోజులకు ఓసారి బుక్ చేసుకుంటే ఇప్పుడు 15 రోజులకే చేసుకుంటున్నారని తెలిపింది. LPG ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలను ఆదేశించినట్లు వెల్లడించింది. కమర్షియల్ కంటే గృహ అవసరాలకే ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించింది.

News March 9, 2026

కాబోయే భార్యతో బెల్లంకొండ.. ఎమోషనల్ ట్వీట్

image

కావ్య రెడ్డితో త్వరలోనే పెళ్లి జరగనున్నట్లు టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రకటించారు. <<19329203>>నిన్న<<>> జరిగింది అనౌన్స్‌మెంట్ మాత్రమేనని, త్వరలో పెళ్లికి సంబంధించిన డేట్స్ వెల్లడిస్తామని ట్వీట్ చేశారు. ‘నా జీవితంలోకి వచ్చి ఎనలేని సంతోషాన్ని ఇచ్చినందుకు కావ్యకు థాంక్స్. నీ ముఖంలోని చిరునవ్వు ఎప్పటికీ మాయమవకుండా చూసుకుంటాం. మనం ఒక్కటయ్యే రోజు కోసం ఎదురుచూస్తున్నా’ అని ఆయన ఎమోషనల్ అయ్యారు.

News March 9, 2026

ఇరాన్ చరిత్రలో గొప్ప ప్రధాని.. బ్రిటన్, అమెరికా కుట్రలతో..

image

మొహమ్మద్ మొస్సాదేగ్ 1951-53 వరకు ఇరాన్ ప్రధానిగా ఉన్నారు. విద్యావంతుడైన ఈయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యారు. తమ క్రూడాయిల్‌పై బ్రిటన్ ఆధిపత్యం ఉండొద్దని జాతీయం చేశారు. దీంతో ఇరాన్ రాజు మొహమ్మద్ రెజా బ్రిటన్, అమెరికాలతో కలిసి.. ఆయన కమ్యూనిజం వైపు వెళ్తున్నారని, రాజద్రోహానికి పాల్పడ్డారని కుట్రలు మోపారు. దీంతో మొస్సాదేగ్ మూడేళ్లు జైలు జీవితం గడిపారు. మరణించే వరకు (1967) గృహనిర్బంధంలోనే ఉన్నారు.