News December 15, 2025
WGL: ఆదివారం కావడంతో తరలివచ్చిన ఓటర్లు

రెండో విడత జీపీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉమ్మడి జిల్లాలో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మొత్తం 564 జీపీలకు గాను 56 జీపీల్లో సర్పంచులు, 917 వార్డులు ఏకగ్రీవం కావడంతో 508 జీపీలకు, 4,020 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు.ఆదివారం సెలవు దినం కావడంతో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. 7,33,323 మంది ఓటర్ల కోసం 4,638 పీఎస్‌లు, 5,686 పీవోలు, 8,191 ఓపీఓలు, 5,500 మంది పోలీసులు పాల్గొన్నారు.
Similar News
News January 16, 2026
పెద్దపల్లి: కాకా మెమోరియల్ T20 లీగ్ ప్రారంభం

కాకా వెంకటస్వామి మెమోరియల్ T20 క్రికెట్ లీగ్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, TGIIC చైర్‌పర్సన్ నిర్మల జగ్గా రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కోనాపూర్‌లో ఆదిలాబాద్–ఖమ్మం జట్ల మ్యాచ్‌తో ఈ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువతలో క్రీడల ద్వారా క్రమశిక్షణ, స్పూర్తి పెరుగుతాయని తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రీడా ప్రతిభను వెలికితీయడంలో ఇలాంటి టోర్నమెంట్లు కీలకమని పేర్కొన్నారు.
News January 16, 2026
ఇంటి సింహద్వారం ఎలా ఉండాలంటే?

ఇంటికి సింహద్వారం ఎంతో ప్రధానమైనదని, ఇది ఇంటి యజమాని అభిరుచికి, ఉన్నతికి నిదర్శనమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు పేర్కొంటున్నారు. ‘సింహద్వారం ఏ దిశలో ఉన్నా దానికి రెండు వైపులా కిటికీలు ఉండటం శాస్త్రరీత్యా తప్పనిసరి. మిగిలిన ద్వారాల కంటే ఇది ఎత్తులోనూ, వెడల్పులోనూ పెద్దదిగా ఉండాలి. ప్రత్యేకమైన ఆకర్షణతో ఉట్టిపడాలి. అప్పుడే ఆ ఇంటికి నిండుదనం, వాస్తు బలం చేకూరుతాయి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 16, 2026
ప్రజల్లో మమేకమై పనిచేయాలి: ఎంపీ రఘునందన్

బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో మమేకమై పని చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. శుక్రవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో సిద్దిపేట నాయకుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. MP మాట్లాడుతూ ప్రజలకు చేరువయ్యేలా సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు తొడుపునూరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.


