News April 20, 2024
కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ అవసరం లేదు: జైలు అధికారులు

కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ అవసరమని డాక్టర్లు సూచించలేదని తిహార్ జైలు అధికారులు తెలిపారు. ఆయన ఆరోగ్య స్థితిపై LGకి రిపోర్ట్ అందించారు. అరెస్ట్ సమయంలో ఆయన కేవలం మెట్‌ఫార్మిన్ టాబ్లెట్ మాత్రమే తీసుకుంటున్నారని వెల్లడించారు. డాక్టర్ సూచనతో కొన్ని నెలల క్రితం తాను ఇన్సులిన్ తీసుకోవడం మానేసినట్లు జైల్లో వైద్యులతో ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు. ఆయన రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా లేవన్నారు.
Similar News
News February 8, 2026
అరటిలో బోరాన్ లోపం లక్షణాలు – నివారణ

అరటిలో బోరాన్ ధాతు లోపం వల్ల ఆకుల ఈనెలు ఉబ్బెత్తుగా, బిరుసుగా, పెళుసుగా మారతాయి. ఆకుల తొడిమలు కురచబారి, మొవ్వులో గుబురుగా ఏర్పడతాయి. చెట్టు ఎదుగుదల తగ్గి, గెలలు చిన్నవిగా ఉండి, మొవ్వు నుంచి పూర్తిగా బయటకు రాదు. కాయలపై నిలువు పగుళ్లు ఏర్పడతాయి. పండు పరిమాణం, నాణ్యత కోల్పోతుంది. దీని నివారణకు లీటరు నీటికి బోరాక్స్/ బోరిక్ ఆమ్లం 1గ్రా. కలిపి ఆకులపై 10 రోజుల వ్యవధిలో 2 లేక 3 సార్లు పిచికారీ చేయాలి.
News February 8, 2026
AERAలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(A<
News February 8, 2026
అన్నదానం ఎంత పుణ్యమో..

అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఉడికించిన బియ్యమే కాదు, ప్రాణశక్తినిచ్చే ప్రతి ఆహారం అన్నమే. మన శరీరంలోని ‘అన్నమయ కోశం’ ఆహారం వలనే ప్రాణశక్తిని పొందుతుంది. అందుకే అన్నదానమంటే ప్రాణం దానం చేయడమే. అందుకే అన్నదానం చేయాలని శాస్త్రాలు చెబుతాయి. ఓ కోయవాడు బ్రాహ్మణుడికి ఓ రాత్రి అన్నం పెట్టిన పుణ్యంతోనే మరుజన్మలో రాకుమారుడిగా జన్మించాడు. అన్నదానానికి విచక్షణతో పనిలేదు. ఆకలితో ఉన్నవారికి పెట్టడమే పరమోత్కృష్టం.


