News December 15, 2025
GWL: నేడు ‘ప్రజావాణి’ కార్యక్రమం రద్దు

గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా, ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని నేడు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజావాణి తిరిగి యథావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, కార్యాలయానికి వచ్చి అసౌకర్యానికి గురి కావొద్దని కలెక్టర్ సూచించారు.
Similar News
News January 9, 2026
వెనిజులాపై మరో దాడి అక్కర్లేదు: ట్రంప్

వెనిజులాలో పొలిటికల్ ప్రిజనర్స్‌ను విడుదల చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వాగతించారు. ‘వాళ్లు శాంతిని కాంక్షిస్తున్నారన్న విషయం అర్థమవుతోంది. ఆయిల్, గ్యాస్ స్ట్రక్చర్‌ను రీబిల్ట్ చేయడంలో US, వెనిజులా కలిసి పనిచేస్తున్నాయి. ఈ సహకారం వల్లే నేను గతంలో ప్లాన్ చేసిన రెండో దఫా దాడులను రద్దు చేశాను. దాని అవసరం రాదు. కానీ రక్షణ కోసం అన్ని నౌకలు అక్కడే ఉంటాయి’ అని తెలిపారు.
News January 9, 2026
వికారాబాద్: టెట్ పరీక్షకు తండ్రి-కొడుకులు

ఉపాధ్యాయులకు టెట్ సంకటంగా మారింది. 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం నిర్వహించిన టెట్ పరీక్షకు పెద్దేముల్ మండలంలోని ఎర్రగడ్డ తండాకు చెందిన గోబ్ర్యా నాయక్ కొండాపూర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్నాడు. తన కొడుకు దినేశ్ గతంలో డీఎస్సీ రాశారు. తాజాగా తండ్రి కొడుకులు పరీక్షకు హాజరవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
News January 9, 2026
బొగ్గు స్కాంలో అమిత్ షా.. నా దగ్గర పెన్ డ్రైవ్‌లు ఉన్నాయి: మమత

బొగ్గు కుంభకోణం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం కేంద్ర మంత్రి అమిత్ షాకే వెళ్తుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తన ప్రభుత్వంపై స్థాయికి మించి ఒత్తిడి చేస్తే అన్నింటినీ బయటపెడతానని హెచ్చరించారు. ‘కోల్ స్కాంలో షా ప్రమేయం ఉంది. నా దగ్గర పెన్ డ్రైవ్‌లు ఉన్నాయి. సీఎం కుర్చీపై ఉన్న గౌరవంతో మౌనంగా ఉన్నా. నేను వివరాలు బయటపెడితే దేశం షేక్ అవుతుంది. ఒక పాయింట్ వరకే దేన్నైనా సహిస్తా’ అని హెచ్చరించారు.


