News December 15, 2025
ఇంధన పొదుపు.. భవితకు మదుపు: కలెక్టర్

ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా భావితరాలకు వెలుగు నిద్దామని కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా సోమవారం భీమవరం ప్రకాశం చౌక్‌లో విద్యుత్ ఉద్యోగులతో చేపట్టిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ప్రస్తుతం మనం విద్యుత్ వృథా చేస్తే భవిష్యత్ తరాలకు అంధకారాన్ని మిగిల్చిన వారమవుతామన్నారు. ఇంధన ప్రాముఖ్యతను ఆదా చేయాల్సిన విధానాలను కలెక్టర్ నాగరాణి వివరించారు.
Similar News
News January 21, 2026
నరసాపురం స్కూల్‌కు జాతీయ స్థాయి గుర్తింపు

నరసాపురం స్టీమర్ రోడ్డులోని మున్సిపల్ మోడల్ ప్రాథమిక పాఠశాల అరుదైన మైలురాయిని అందుకుంది. స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ (SHVRM) మూల్యాంకనంలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, జాతీయ పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా హెచ్ఎం సుధీర్ బాబు, ఉపాధ్యాయులను ఎంఈవోలు పుష్పరాజ్యం, జాన్ ప్రభాకర్ అభినందించారు. పాఠశాల పారిశుద్ధ్యం, హరిత వనరుల నిర్వహణపై అధికారులు ప్రశంసలు కురిపించారు.
News January 20, 2026
పగో కలెక్టర్ నాగరాణికి ‘ఉత్తమ’ పురస్కారం

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి 2025 సంవత్సరానికి ‘ఉత్తమ ఎన్నికల విధానాల’ అవార్డుకు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాలకు వివిధ విభాగాల్లో పురస్కారాలు దక్కగా.. పగో కలెక్టర్‌కు ఈ గౌరవం లభించింది. జనవరి 25న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు.
News January 20, 2026
ప.గో: ఇంటర్ పరీక్షలపై డీఆర్వో సూచనలు

ఈ నెల 21 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 53 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయని, ఎక్కడా మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. విద్యుత్, రవాణా, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.


