News December 15, 2025
సింహాచలంలో డిసెంబర్ 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు

సింహాచలంలో డిసెంబర్ 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో సుజాత తెలిపారు. డిసెంబర్ 20 నుంచి 29 వరకు ఆలయంలో అన్ని అర్జీత సేవలను రద్దు చేశామన్నారు. డిసెంబర్ 30 నుంచి JAN 9 వరకు సహస్రనామార్చన రద్దు, రాత్రి 7 గం.ల వరకు మాత్రమే దర్శనాలు కల్పించనున్నారు. JAN 11న కూడారై ఉత్సవం సందర్భంగా ఉ.9 నుంచి 10:30 వరకు దర్శనాలు నిలిపివేశారు. JAN 16 నుంచి 19 వరకు ఆరాధన, సుప్రభాత సేవ టికెట్లు రద్దు చేశారు.
Similar News
News January 5, 2026
రేపు సిరిసిల్లకు కవిత.. సర్వత్ర ఆసక్తి

బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ గురైన తర్వాత తొలిసారిగా జాగృతి అధ్యక్షురాలు <<18764978>>కల్వకుంట్ల కవిత<<>> సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. తన అన్న ఇలాకాలో కవిత ఈనెల 6, 7 తేదీల్లో పర్యటించనున్నారు. జిల్లాలో మొదటి రోజు తంగళ్ళపల్లి, సిరిసిల్ల పట్టణం, కోనరావుపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో పర్యటన సాగనుండగా, జాగృతి నేతలు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. కవిత పర్యటనపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
News January 5, 2026
ములుగు: సన్న బియ్యంలో నూకలు.. ఎక్కడివి?

జిల్లా వ్యాప్తంగా చౌక ధరల( రేషన్ షాప్) దుకాణాల్లో పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో నూకలు రావడంపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కిలో బియ్యంలో 100 గ్రాముల వరకు నూకలు వస్తున్నాయని సన్న బియ్యం లబ్ధిదారులు వాపోతున్నారు. రైతులు పండించిన ధాన్యంలో నూక శాతానికి తరుగు తీసి, ప్రభుత్వం పంపిణీ చేసే సన్న బియ్యంలో నూకలు ఎక్కడివని సన్న బియ్యం లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
News January 5, 2026
మంచిర్యాల: పుర పోరు.. త్రిముఖ పోటీ

రానున్న మున్సిపల్ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు గెలుపు గుర్రాల కోసం కసరత్తు చేస్తున్నాయి. ఆయా మున్సిపాలిటీ ఏరియాలో సమావేశాలు నిర్వహించి అభ్యర్థులను ఉత్తేజ పరుస్తున్నారు. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది. జిల్లాలో త్రిముఖ పోటీ నెలకొననున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


