News December 15, 2025

VJA: రేపు భవానీపురానికి రానున్న వై.ఎస్ జగన్‌

image

వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 9:20కు బెంగళూరు నుంచి బయలుదేరి 12 గంటలకు గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన భవానీపురం రానున్నారు. మధ్యాహ్నం 12:50 గంటలకు ఇటీవల కూల్చివేసిన 42 గృహాల స్థలాలను పరిశీలించి, బాధితులతో మాట్లాడతారని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయం తెలిపింది.

Similar News

News December 16, 2025

తిరుపతి: TTD ఆలయాల్లో యూపీఐ చెల్లింపులకు కియోస్క్‌లు, క్యూఆర్ కోడ్లు..

image

దేశవ్యాప్తంగా ఉన్న 60 టీటీడీ ఆలయాల్లో భక్తులు సులభంగా యూపీఐ చెల్లింపులు చేసేందుకు కియోస్క్ మిషీన్లు, క్యూఆర్ కోడ్స్ ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుమల తరహాలో తిరుచానూరు, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయాల్లో భక్తుల అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మించనున్న 5,000 ఆలయాలకు రెండు–మూడు డిజైన్లు సిద్ధం చేసి వేగవంతం చేయాలని ఆదేశించారు.

News December 16, 2025

నంద్యాల: ‘ఫైనాన్స్ సంస్థ బెదిరింపుల నుంచి కాపాడాలి’

image

తమకు ఎలాంటి లోన్‌లు లేకపోయినా ఫైనాన్స్ సంస్థవారు తప్పుడు సమాచారాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్‌కు పెద్ద దేవలాపురంకి చెందిన రామారావు ఫిర్యాదు చేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 107 ఫిర్యాదులు అందినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి. పిన్నాపురంకి చెందిన వెంకటరాజు, అబ్దుల్లాపురం రత్నమ్మలు తన భూమిని ఇప్పించాలని కోరారు.

News December 16, 2025

శ్రీకాకుళం: 3 ఏళ్ల నిరీక్షణకు.. నేటితో తెర..!

image

కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022 నవంబర్‌లో విడుదలై నేటికీ దాదాపు 3 సంవత్సరాలు పూర్తయింది. ప్రభుత్వం కోర్టు కేసులు పరిష్కరించి అర్హత గల కానిస్టేబుల్ అభ్యర్థుల జాబితాను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన వారికి నేడు మంగళగిరిలోని జరిగే కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి బస్సుల్లో మంగళగిరి చేరుకున్నారు.