News December 15, 2025
SDPT: కేసీఆర్ స్వగ్రామంలో ఎవరూ గెలిచారంటే!

మాజీ సీఎం కేసీఆర్ స్వగ్రామంలో BRS హావ కొనసాగింది. సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో BRS బలపరిచిన అభ్యర్థి మోత్కు సుమలత శంకర్ 883 ఓట్ల భారీ మెజారిటీతో సమీప ప్రత్యర్థిపై గెలిచారు. మరోసారి చింతమడక ప్రజలు BRSకు ఓట్లు వేసి కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇచ్చామని గ్రామస్థులు తెలిపారు.
Similar News
News January 14, 2026
ఏలూరులో సంక్రాంతి వేడుకల్లో ఎడ్ల బండిపై ఎస్పీ దంపతులు

ఏలూరులో పోలీసు ప్రధాన కార్యాలయ ఆవరణలో సంక్రాంతి సంబరాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ ప్రతాప శివ కిషోర్, ఆయన సతీమణి ధాత్రి రెడ్డి (రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో) దంపతులు సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి, చిన్నారులకు భోగి పళ్లు పోశారు. అనంతరం పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఎడ్లబండిపై విహరించి అందరినీ అలరించారు. ఈ వేడుకల్లో పోలీసు కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి.
News January 14, 2026
గిల్ మినహా టాపార్డర్ విఫలం

న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత టాపార్డర్ విఫలమైంది. కెప్టెన్ గిల్(56) మినహా రోహిత్(24), కోహ్లీ(23), అయ్యర్(8) నిరాశపర్చారు. ఓపెనింగ్ జోడీ తొలి వికెట్‌కు 70 పరుగులు నమోదు చేసింది. 99 రన్స్ వద్ద రెండో వికెట్ కోల్పోగా 19 పరుగుల వ్యవధిలోనే 3 కీలక వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. NZ బౌలర్ క్లర్క్ 3 వికెట్లతో చెలరేగారు. 26 ఓవర్లో భారత్ స్కోరు 125-4.
News January 14, 2026
మాకవరపాలెం: సంక్రాంతికి అత్తవారింటికి వస్తుండగా ప్రమాదం.. వ్యక్తి మృతి

మాకవరపాలెం(M) పైడిపాలెం సెంటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై దామోదర్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. తూ.గో జిల్లాకు చెందిన కీర్తి రాంబాబు(32) బుధవారం సంక్రాంతి పండుగకు మాకవరపాలెం(M) తామరంలోని అత్తవారింటికి బైకుపై వస్తున్నాడు. పైడిపాల సెంటర్ వద్ద ఎదురుగా వస్తున్న ఆటో బైక్‌ను ఢీకొట్టింది. రాంబాబు తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనికి వివాహమై ఏడాదవుతోంది.


