News December 15, 2025

ప్రియాంకకు AICC పగ్గాలు!

image

వరుస ఓటములతో నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ప్రియాంక గాంధీకి AICC అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. నాయకత్వ మార్పుపై పలువురు నేతలు ఇప్పటికే SONIAకు లేఖలూ రాశారు. ఖర్గే అనారోగ్య కారణాలతో ఈ డిమాండ్ పెరిగింది. ఇందిర రూపురేఖలతో పాటు ఇటీవలి కాలంలో క్రియాశీలకంగా ఉన్న ప్రియాంక రాకతో INCకి పునర్వైభవం వస్తుందని వారు భావిస్తున్నారు.

Similar News

News January 13, 2026

ముగ్గులతో ఆరోగ్యం..

image

సంక్రాంతి నెల వచ్చిందంటే చాలు ముగ్గులూ వాటి మీద ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు కనువిందు చేస్తుంటాయి. హేమంతరుతువులో సూర్యుడు భూమికి దూరంగా ఉండటం వల్ల వాతావరణం చల్లగా ఉండి, క్రిమికీటకాదులతో వ్యాధులు ప్రబలే అవకాశముంది. ఇంటి ముంగిళ్లలో పేడనీళ్లు చల్లి గుల్లసున్నంతో ముగ్గులేయడం, గొబ్బెమ్మలను పెట్టడం క్రిమికీటకాల సంహారానికి తోడ్పడుతుంది. వంగి ముగ్గులు వేయడం వల్ల శరీరానికి వ్యాయామం ఏర్పడుతుంది.

News January 13, 2026

ముగ్గు వేస్తే ఆరోగ్యం..

image

ఉదయాన్నే ముగ్గు వేస్తే మహిళలకు వ్యాయామం అవుతుంది. ఇది వెన్నెముకను దృఢపరుస్తుంది. జీర్ణక్రియను, పునరుత్పత్తి అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. చేతులు, కాళ్ల కదలికల వల్ల శరీరానికి చక్కని మసాజ్ అందుతుంది. స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. బియ్యప్పిండితో ముగ్గు వేస్తే చీమలు, పిచ్చుకల వంటి జీవులకు ఆహారం లభిస్తుంది. ఈ ప్రాసెస్ ఏకాగ్రతను పెంచే ఒక అద్భుతమైన మెడిటేషన్ వంటిది.

News January 13, 2026

త్వరలో చిరంజీవితో సినిమా చేస్తా: మారుతి

image

త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నట్లు ‘రాజాసాబ్’ డైరెక్టర్ మారుతి చెప్పారు. ‘‘రాజాసాబ్’ మూవీకి 3 ఏళ్ల కష్టం 3 గంటలు తీసి చూపిస్తే ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు. త్వరలో వాళ్లే రియలైజ్ అవుతారు. నేనేమీ వారిని శపించట్లేదు. వారిపట్ల బాధ‌పడుతున్నా. రాజాసాబ్ రెండోసారి చూస్తే రైటింగ్‌లో లోతు తెలుసుకుంటారు. అర్థం చేసుకోవాలంటే మరోసారి చూడండి’’ అని మీడియా చిట్ చాట్‌లో అన్నారు.