News December 15, 2025

HYD: ఇందిరా గాంధీలో మరో కోణం ఈ బుక్

image

ఇందిరా గాంధీని రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాక, ప్రకృతితో ఆత్మీయ బంధం కలిగిన వ్యక్తిత్వంగా ఆవిష్కరించిన నవల ‘ఇందిరా గాంధీ: ఒక ప్రకృతి ప్రేమికురాలి జీవితం’. అధికార శిఖరంపై ఉన్నప్పటికీ పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణకు ఆమె ఇచ్చిన ప్రాధాన్యతను రచయిత సజీవంగా చిత్రించారు. రాజకీయ జీవితం- ప్రకృతి ప్రేమ మధ్య సమతౌల్యాన్ని చూపిన ఈ నవల జీవన విలువలను గుర్తుచేసే గొప్ప రచనగా నిలుస్తుంది.

Similar News

News January 15, 2026

కోకాకోలా $1B ఐపీఓ? క్లారిటీ ఇచ్చిన కంపెనీ

image

హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (HCCB) IPOపై వస్తున్న వార్తలను ఆ కంపెనీ తోసిపుచ్చింది. ఈ వేసవిలో లేదా సమీప భవిష్యత్తులో అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని సంస్థ ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాము కేవలం మార్కెట్‌లో పట్టు సాధించడం, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంపైనే ఫోకస్ పెట్టామన్నారు. GST వల్ల లభించిన ధరల ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తున్నామని తెలిపారు. IPO వార్తలన్నీ ఊహాగానాలేనన్నారు.

News January 15, 2026

సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో ఆర్టీసీ ఆంక్షలు

image

ఆర్టీసీ, పోలీస్ ఆదేశానుసారం రేపు నిర్మల్లో సీఎం సభ ఉన్నందున ఉదయం 11 నుంచి సభ అయిపోయే వరకు భైంసావైపు నుంచి వచ్చిపోయే బస్సులు ఈద్ ఘా చౌరస్తా వరకు, ఖానాపూర్, మంచిర్యాలవైపు నుంచి వచ్చిపోయే బస్సులు కొండాపూర్ బైపాస్ వరకు, నిజామాబాద్, హైదరాబాద్‌వైపు నుంచి వచ్చిపోయే బస్సులు సోఫీ నగర్ వరకు, ఆదిలాబాద్‌వైపు నుంచి వచ్చి వెళ్లే బస్సులు బైల్ బజార్ వరకు నడుపుతామని ఆర్టీసీ డీఎం పండరి తెలిపారు.

News January 15, 2026

దేశ భద్రత విషయంలో ముందుంటాం: CM

image

TGలో మరో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆర్మీ అధికారులను CM రేవంత్ కోరారు. పదేళ్లుగా ఒక్క స్కూలును కూడా మంజూరు చేయలేదన్నారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని HYDకు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశ భద్రత అంశాల్లో సహకరించడంలో TG సర్కార్ ముందుంటుందని, లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్‌కు VKDలో 3వేల ఎకరాలు కేటాయించినట్లు HYDలో జరిగిన సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్‌లో గుర్తుచేశారు.