News December 15, 2025

కామారెడ్డి: మూడో విడత ఎన్నికలు.. ర్యాండమైజేషన్ పూర్తి

image

కామారెడ్డి జిల్లాలో జరగనున్న మూడో విడత జీపీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది ఎంపికకు సంబంధించి మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ సోమవారం పూర్తైంది. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, సాధారణ పరిశీలకుడు సత్యనారాయణ రెడ్డి సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. బాన్సువాడ డివిజన్ పరిధిలోని 8 మండలాల పోలింగ్ సిబ్బందిని ఈ ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు.

Similar News

News January 25, 2026

నిర్మల్: పుర పోరు.. 40 నామినేషన్ కేంద్రాలు

image

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 80 వార్డులకు ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నామినేషన్ల స్వీకరణ కోసం ప్రతి రెండు వార్డులకు ఒకటి చొప్పున 40 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులకు 27 మంది ఆర్‌ఓలు, 27 మంది ఏఆర్‌ఓలు, 13 మంది నోడల్ అధికారులను నియమించారు. ఇప్పటికే వార్డులు, ఛైర్మన్ రిజర్వేషన్లు ఖరారు కాగా, షెడ్యూలు వెలువడటమే తర్వాయి అని అధికారులు వెల్లడించారు.

News January 25, 2026

NGKL: మున్సిపల్ పోరుకు సిద్ధం.. ఇన్చార్జిల నియామకం!

image

నాగర్ కర్నూల్ జిల్లాలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జిలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు, కల్వకుర్తికి మాజీ కార్పొరేషన్ రాజీవ్ సాగర్, కొల్లాపూర్‌కు ఉప్పల వెంకటేష్ గుప్తా, అమన్‌గల్‌కు రజిని సాయిచందు ను నియమించారు.

News January 25, 2026

తిరుమల గిరుల్లో రథసప్తమి శోభ

image

AP: తిరుమలలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 5:30 గంటలకే మలయప్ప స్వామి ఉభయ దేవతలతో కలిసి సూర్యప్రభ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో గ్యాలరీలు కిక్కిరిసిపోయాయి. శ్రీవారి నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.