News December 15, 2025

భారీ జీతంతో మేనేజర్ పోస్టులు

image

<>ఉడిపి <<>>కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 3 మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 31వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ(మెకానికల్/నావల్ ఆర్కిటెక్చర్/మెరైన్ Eng) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. మేనేజర్‌కు నెలకు రూ.1,18,400, డిప్యూటీ మేనేజర్‌కు రూ.98,400 చెల్లిస్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

Similar News

News January 15, 2026

తగ్గిన బంగారం ధర.. మరోసారి పెరిగిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.820 తగ్గి రూ.1,43,180కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.750 తగ్గి రూ.1,31,250గా ఉంది. మరోవైపు వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. నిన్న కేజీపై రూ.15,000 పెరగగా, ఈరోజు రూ.3,000 పెరిగింది. మొత్తంగా రెండు రోజుల్లో 18,000 ఎగబాకి రూ.3,10,000 చేరింది.

News January 15, 2026

బాలింతలు యాంటీబయాటిక్స్ తీసుకోవచ్చా?

image

పాలిచ్చే తల్లులు యాంటీబయాటిక్స్ తీసుకోవచ్చా లేదా అనేది వారి ఆరోగ్యస్థితిపై ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే పిల్లల వయసు, ఆరోగ్యం, తల్లికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి డాక్టర్లు యాంటీబయాటిక్స్ రాస్తారు. పాలద్వారా యాంటీబయాటిక్స్ తక్కువ మొత్తంలోనే ట్రాన్స్‌ఫర్ అవుతాయి. అయినా ఇలాంటి మందులేవైనా వాడేముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోనే వాటిని వాడాలని సూచిస్తున్నారు.

News January 15, 2026

విమానాలు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు

image

నిరసనల కారణంగా ఇరాన్‌ <<18861323>>గగనతలాన్ని<<>> మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో ఎయిరిండియా, ఇండిగో సహా భారతీయ విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేశాయి. కొన్ని అంతర్జాతీయ విమానాలను దారిమళ్లిస్తున్నట్లు, మరికొన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ మార్పులు, అప్డేట్ల కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌లను పరిశీలించాలని కోరాయి. మరోవైపు ఇప్పటికే కేంద్రం ఇరాన్‌లోని భారతీయులను అప్రమత్తం చేసింది.