News December 15, 2025
లంగ్స్‌కు ఇన్సూరెన్స్ ఉందా మెస్సీ?.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు

‘గోట్ టూర్’లో భాగంగా ఇవాళ ఢిల్లీలో ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ పర్యటించనున్నారు. అయితే ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా ఉండటంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘ఢిల్లీకి స్వాగతం మెస్సీ. మీ ఎడమ కాలికి $900M ఇన్సూరెన్స్ ఉందని విన్నా. మరి లంగ్స్‌కు ఉందా?’ అని ఓ యూజర్ ట్వీట్ చేశారు. మెస్సీ గోల్స్ రికార్డును ఢిల్లీ ఏక్యూఐ బ్రేక్ చేస్తుందని మరొకరు పోస్ట్ చేశారు.
Similar News
News December 16, 2025
పోలీసుల అదుపులో 15 మంది మావోయిస్టులు

TG: కొమురం భీమ్(D) సిర్పూర్‌లో 15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారంతో వారు తలదాచుకున్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. లొంగిపోయేందుకే వారంతా ఛత్తీస్‌గఢ్ నుంచి ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం ‘ఆపరేషన్ కగార్’ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇటీవల వివిధ రాష్ట్రాల్లో పలువురు మావోయిస్టు నేతలు లొంగిపోయిన సంగతి తెలిసిందే.
News December 16, 2025
జీడిమామిడిలో బూడిద తెగులు – నివారణ ఎలా?

జీడిమామిడి తోటల్లో పూత దశలో వివిధ రకాల తెగుళ్లు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పొడి వాతావరణం ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువగా పూతను ఆశిస్తుంది. లేత చిగుర్లను, పూతను బూడిద తెగులు ఆశించి ఎండిపోయేలా చేసి పంటను నష్టపరుస్తుంది. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి సల్ఫర్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి ట్రై డేమోర్ప్ 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
News December 16, 2025
కానుకల లెక్కింపులో టెక్నాలజీ వాడాలి: హైకోర్టు

AP: పరకామణి నేరం దొంగతనం కన్నా మించినదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘కానుకల లెక్కింపులో టెక్నాలజీ వినియోగించాలి. తప్పిదం జరిగితే తక్షణం అప్రమత్తం చేసేలా అది ఉండాలి. లెక్కింపును మానవరహితంగా చేపట్టాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యత ఉండదు. అందువల్లనే పరకామణి ఘటన జరిగింది’ అని పేర్కొంది. కానుకల లెక్కింపునకు భక్తులను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. పరకామణిలో టేబుళ్లు ఏర్పాటుచేయాలని సూచించింది.


