News December 15, 2025

మెదక్: నాడు గెలిచి.. నేడు ఓడిన దంపతులు

image

మెదక్ మండలం మాచవరం గ్రామపంచాయతీ ఎన్నికపై అందరి దృష్టి ఆకర్షించే విషయం తెలిసిందే. ఇక్కడ గత ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా విజయం సాధించిన దంపతులు ఈసారి ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో సర్పంచిగా సంధ్యారాణి, వార్డు సభ్యులుగా శ్రీనివాస్ చౌదరి గెలుపొందారు. ఈసారి సర్పంచ్ పదవికి శ్రీనివాస్ చౌదరి, వార్డు సభ్యులు పదవికి సంధ్యా రాణి పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఇక్కడ సాంబశివరావు గెలుపొందారు.

Similar News

News January 3, 2026

మెదక్: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జరగాలి: ఎస్పీ

image

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు తప్పిపోయిన, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పిల్లలను రక్షించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్–12 పోస్టర్లను ఎస్పీ డీవీ శ్రీనివాస రావు ఆవిష్కరించారు. ఈ విషయంలో అవగాహన ముఖ్యమన్నారు. బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనపు ఎస్పీ మహేందర్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్ ఉన్నారు.

News January 3, 2026

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో పరేడ్

image

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఈరోజు పరేడ్ నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పరేడ్‌కు హాజరై గౌరవ వందనం స్వీకరించి పరిశీలించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం అవసరమని సిబ్బందికి సూచించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించి ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.

News January 2, 2026

నర్సాపూర్ బీవీఆర్ఐటీలో టెట్ పరీక్షా కేంద్రం

image

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG-TET)పరీక్షను జిల్లాలో నర్సాపూర్ BVRITలో ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి విజయ తెలిపారు. ఈనెల 4న ఉ.9 నుంచి 11.30 గంటల వరకు, మ.2 నుంచి సా.4.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. మొత్తం 400 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. హాల్ టికెట్లను https://tgtet.aptonline.in/tgtet వెబ్‌సైట్‌ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు.