News December 15, 2025
నల్గొండ: సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని వినతిపత్రం

నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో డిసెంబర్ 30 నుంచి నిర్వహించే పీజీ 3 సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కి ఏబీవీపీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. యూనివర్సిటీ అధ్యక్షుడు హనుమాన్ మాట్లాడుతూ.. డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు నెట్ పరీక్ష ఉన్నందున విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వాయిదా వేయాలని కోరారు. యూనివర్సిటీ కార్యదర్శి మోహన్, విజయ్, వెంకటేశ్, సుధీర్ పాల్గొన్నారు.
Similar News
News March 4, 2026
WNP: ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు.. DIEO

ఇంటర్ పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్ష జరుగుతున్న నేపథ్యంలో డీఐఈవో ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు.
News March 4, 2026
యుద్ధంతో వీటి ధరలు పెరుగుతాయ్!

ఇరాన్ వార్‌తో మనదేశంలో కంది, పెసరపప్పు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆఫ్రికా, మయన్మార్, కెనడా నుంచి భారత్ ఏటా 5-6 మిలియన్ టన్నుల పప్పుధాన్యాలు దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్, అఫ్గాన్ నుంచి వచ్చే జీడిపప్పు, పిస్తా, ఎండుద్రాక్ష, కుంకుమపువ్వు, ఆప్రికాట్ సరఫరాపై ప్రభావం పడటంతో వాటి ధరలకూ రెక్కలొచ్చే ఛాన్స్ ఉంది. హార్ముజ్ జలసంధి నుంచి ఫెర్టిలైజర్ సప్లై కూడా నిలిచిపోవడంతో వాటి ధరలు కూడా పెరగనున్నాయి.
News March 4, 2026
కర్నూలు: నా భర్తను కనిపెట్టండి.. భార్య ఆవేదన!

దేవనకొండ మండలం బండగట్టుకు చెందిన కురువ ధర్మ, కురువ మౌనిక ఇష్టంతో వివాహం చేసుకున్నారు. వారం తర్వాత ధర్మ కనిపించకపోవడంతో మౌనిక తీవ్ర ఆందోళనకు గురైంది. భర్త ఆచూకీ తెలియకపోవడంతో అతని ఇంటి ముందు కూర్చొని “నాకు న్యాయం చేయాలి, నా భర్తను కనిపెట్టండి” అంటూ వేడుకుంటోంది. అయితే ధర్మ తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోకి అనుమతించడం లేదు.


