News December 15, 2025

ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి

image

ఏలూరు జిల్లాలో సోమవారం సాయంత్రం విషాదం నెలకొంది. కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 15, 2026

ఎర్రవెల్లి నివాసంలో KCR సంక్రాంతి వేడుకలు

image

TG: ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకలు నిర్వహించుకున్నారు. కుమారుడు కేటీఆర్ కూడా ఫ్యామిలీతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఫాంహౌజ్‌లో రంగు రంగుల ముగ్గు ముందు కేసీఆర్‌తో కలిసి దిగిన ఫొటోలను KTR Xలో షేర్ చేశారు. తమ కుటుంబసభ్యుల తరఫున రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సంక్రాంతి విషెస్ చెప్పారు.

News January 15, 2026

గద్వాల్: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే

image

సీఎం రేవంత్ రెడ్డిని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, MBNR ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గురువారం కలిశారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, కేటీఆర్, హరీశ్ రావు చేస్తున్న వ్యాఖ్యల గురించి చర్చించినట్లు సమాచారం.

News January 15, 2026

77వ రిపబ్లిక్ డే వేడుకలకు గెస్టులు వీరే

image

ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు గెస్టుల పేర్లను కేంద్రం ప్రకటించింది. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా(పోర్చుగల్), యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ (జర్మనీ) రానున్నట్లు తెలిపింది. వేడుకల అనంతరం వీరు ఈనెల 27న PM మోదీతో ట్రేడ్ డీల్‌పై చర్చించనున్నారు. కాగా ఈ నెలాఖరున EUతో భారత్ ట్రేడ్ డీల్ సైన్ చేసే అవకాశముందని ట్రేడ్&కామర్స్ సెక్రటరీ రాజేశ్ అగర్వాల్ తెలిపారు.