News December 15, 2025
రాష్ట్రంలోనే బాపట్ల జిల్లాకు ఏడో స్థానం

ఇ-ఆఫీస్ విధానాన్ని అధికారులు అలవర్చుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. ఈ-ఆఫీస్ విధానంలో రోజుకు 9 గంటల్లో జిల్లాలో 1,363 ఫైల్స్ పరిశీలన, పరిష్కారంపై రాష్ట్రంలోనే 7వ స్థానంలో నిలిచానన్నారు. దీంతో జిల్లా అధికారులు కలెక్టర్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఖజానా శాఖలో ఈ-ఫైల్స్ ఒక్కటి కూడా నమోదు కాకపోవడంపై ఆరా తీశారు. నిర్లిప్తంగా ఉండరాదని, కచ్చితంగా ఈ-ఫైలింగ్ చేపట్టాలని ఆదేశించారు.
Similar News
News January 12, 2026
మేడారం: ఆర్టీసీ బస్సులు, వీఐపీలకు తాడ్వాయి రూట్..!

మేడారం వచ్చే RTC బస్సులు, వీఐపీల వాహనాలకు అధికారులు తాడ్వాయి రూట్‌ను కేటాయించారు. పస్రా వద్ద తనిఖీ అనంతరం తాడ్వాయి మీదుగా మేడారం చేరుకోవచ్చు. తిరుగు ప్రయాణంలో ఇదే రూట్‌ను అనుసరించాలి. బస్సులు, వీఐపీ వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ఖమ్మం నుంచి వచ్చే వాహనాల కోసం ఈసారి లవ్వాల-బందాల-పస్రా దారిని అందుబాటులోకి తెచ్చారు.
News January 12, 2026
కొత్త జిల్లాలు రద్దు చేస్తారా? TGలో ఇదే హాట్ టాపిక్

TG: జిల్లాల <<18778067>>పునర్వ్యవస్థీకరణ<<>> పేరిట కొత్త జిల్లాల రద్దుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని BRS ఆరోపిస్తోంది. రద్దు చేస్తే ఊరుకోబోమంటూ సిరిసిల్ల, సిద్దిపేట సహా పలు జిల్లాల్లో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మరోవైపు HNK జిల్లాను WGLలో కలిపేస్తామని తాజాగా కాంగ్రెస్ MLA నాయిని రాజేందర్ పేర్కొన్నారు. దీంతో జిల్లాలను కుదిస్తారా లేదా సరిహద్దులను మాత్రమే మారుస్తారా అనేది చర్చనీయాంశమైంది.
News January 12, 2026
చిత్తూరు కలెక్టరేట్‌లో ప్రారంభమైన PGRS

చిత్తూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కార దిశగా సంబంధిత అధికారులకు ఫిర్యాదులపై బాధితుల ముందే పరిష్కరిస్తున్నారు. మండల స్థాయిలోనే ఫిర్యాదులు పరిష్కారం అవ్వాలని ఆదేశించారు. డీఆర్ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్ పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు.


