News December 15, 2025
సామాన్యుల సమస్యల పట్ల అలసత్వం వద్దు: SP

పోలీస్ స్టేషన్లకు వచ్చే సామాన్య ప్రజల సమస్యల పట్ల స్పందించడంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకూడదని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం గరగపర్రులోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టంలో ఆయన 11 అర్జీలను స్వీకరించారు. నిర్ణీత గడువులోగా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.
Similar News
News January 3, 2026
భీమవరం: గోదావరి క్రీడా ఉత్సవాలు ప్రారంభించిన కలెక్టర్

భీమవరంలో రెండురోజులపాటు జరిగే గోదావరి క్రీడా ఉత్సవాలను శనివారం కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. మండల, డివిజన్ స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన బృందాలు జిల్లా స్థాయిలో తలపడనున్నాయి. శని, ఆదివారాల్లో క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాట్మెంటన్, చెస్, టెన్ని కాయిట్, త్రో బాల్, క్యారమ్స్, షాట్ పుట్ వంటి 9 క్రీడాంశాలలో 235 బృందాలు, అథ్లెటిక్స్ 56 మందితో క్రీడా పోటీలను నిర్వహించనున్నారని తెలిపారు.
News January 2, 2026
ప.గో జిల్లాలో కిడ్నాప్ కలకలం

ఆకివీడు మండలంలోని తాళ్లకోడు ఎన్టీఆర్ కాలనీలో శుక్రవారం మధ్యాహ్నం కిడ్నాప్ ఉదంతం కలకలం రేపింది. కాలనీకి చెందిన ఐదేళ్ల చిన్నారిపై ఆగంతకులు స్ప్రే చల్లి ఎత్తుకెళ్లినట్లు స్థానిక దివ్యాంగురాలు రుక్మిణి కుమారి తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ హనుమంతు నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
News January 2, 2026
ప.గో: ‘వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి’

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం-2026 సందర్భంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి గోడపత్రికలు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తతతో ఉండాలన్నారు.


