News December 15, 2025

మద్యం దుకాణాలను మూసివేయాలి: ఆదర్శ్ సురభి

image

వనపర్తి జిల్లాలో ఈనెల 17న 3వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆయా మండలాల్లో 5PM తర్వాత ఎటువంటి ప్రచారం నిర్వహించడానికి అనుమతి లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.పానగల్, వీపనగండ్ల, శ్రీరంగాపూర్, చిన్నంబావి, పెబ్బేర్ మండలాలలో నిషేధాజ్ఞలు 5గంటల నుంచి అమలులోకి వస్తాయన్నారు. అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

Similar News

News January 14, 2026

రూ.15,000 పెరిగిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీపై ఏకంగా రూ.15,000 పెరిగి రూ.3,07,000కు చేరింది. బంగారం ధరలు సైతం గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,090 ఎగబాకి రూ.1,43,620కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,000 పెరిగి రూ.1,31,650గా ఉంది. 3 రోజుల్లో కేజీ వెండి ధర రూ.32,000 పెరగడం గమనార్హం.

News January 14, 2026

దారుణం.. విష ప్రయోగంతో 600 కుక్కలు మృతి

image

TG: కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. వీధికుక్కలపై విషప్రయోగం జరగడంతో దాదాపు 500-600 శునకాలు మృతిచెందాయి. మాచారెడ్డి(M) ఫరీద్‌పేట్, భవానీపేట, వాడి, పల్వంచలో నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై ‘గౌతమ్ స్ట్రే యానిమల్స్ ఫౌండేషన్’ ప్రతినిధులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

News January 14, 2026

నల్గొండ: 23, 24 తేదీల్లో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు

image

జిల్లాకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ నెల 23, 24 తేదీల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ సెక్రటరీ ఎన్. వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల జర్నలిస్టులు 20 తేదిలోగా నల్గొండ పౌర సంబంధాల అధికారిని సంప్రదించాలన్నారు.