News April 20, 2024
KMM: ఇక గొర్రెల పంపిణీ లేనట్టేనా!

గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్ధకశాఖ అధికారులు నిర్ణయించారు. గతేడాది డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు గొర్రెల పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గొర్రెల పెంపకందారులు తమకు ప్రభుత్వం వెంటనే యూనిట్లు పంపిణీ చేయాలని లేదా.. తాము చెల్లించిన డీడీలు అయినా వెనక్కి ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 19, 2026
ఇంటి ముంగిటకే వైద్యం: డీఎంహెచ్‌ఓ రామారావు

ఖమ్మం జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 20 స్పెషలిస్ట్ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ డి. రామారావు తెలిపారు. ఈ నెల 31 వరకు శిబిరాలు కొనసాగనున్నాయని చెప్పారు. స్త్రీ, శిశు, కంటి వైద్య నిపుణులు ఉచిత సేవలు అందిస్తారని, ఇప్పటివరకు 9 శిబిరాలు పూర్తయ్యాయన్నారు. మిగిలిన శిబిరాల్లో పరీక్షలు, మందులు ఉచితంగా అందజేస్తామని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.
News March 19, 2026
ఖమ్మం: ఉద్యోగం లేని వారికి మంచి ఛాన్స్

ఖమ్మం జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు DYSO సునీల్ రెడ్డి తెలిపారు. కంప్యూటర్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో 3 నెలల శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గలవారు ఆధార్, విద్యార్హత పత్రాలతో నేరుగా కార్యాలయంలో సంప్రదించాలని, వివరాలకు 99482 07271 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
News March 19, 2026
రైలు ఢీకొని వృద్ధుడి మృతి

పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వృద్ధుడుమృతి చెందాడు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం బోనకల్లు-చింతకాని రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న జీఆర్‌పీ ఎస్‌ఐ వెంకటేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతుడిని గుర్తించిన వారు 96529 39431 నంబరుకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


