News December 15, 2025
3వ విడత ఎన్నికకు పూర్తి స్థాయి ఏర్పాట్లు: ASF కలెక్టర్

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 3వ విడత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. సోమవారం ASF కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా 3వ విడత ఎన్నికల నిర్వహణపై ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్ నగర్ మండలాల స్టేజ్ 2 ఆర్.ఓ.లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Similar News
News January 12, 2026
యాదాద్రి: వారిపై క్రిమినల్ కేసులు: కలెక్టర్

సాంకేతికత దుర్వినియోగం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. సాంకేతికతను దుర్వినియోగం చేయడం చట్ట విరుద్ధమని, జిల్లాలో ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సిన మొత్తాన్ని తగ్గించి జమ చేసిన ఫైల్స్ అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై విచారణకు అదేశించారు.
News January 12, 2026
మరోసారి పాక్ డ్రోన్ల కలకలం

సరిహద్దుల్లో మరోసారి పాకిస్థాన్ డ్రోన్లు కలకలం రేపాయి. జమ్మూకశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్‌లో LoC వెంబడి ఇవాళ సాయంత్రం ఓ డ్రోన్ చక్కర్లు కొట్టింది. దీంతో ఆర్మీ ఫైరింగ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. తర్వాత మరికొన్ని కనిపించినట్లు ఆర్మీ వర్గాలు చెప్పాయి. ఆయుధాలు/డ్రగ్స్ జారవిడిచారనే అనుమానంతో సెర్చ్ చేస్తున్నట్లు చెప్పాయి. సాంబా సెక్టార్‌లో నిన్న డ్రోన్ ద్వారా పాక్ వెపన్స్ <<18815524>>డ్రాప్ చేయడం<<>> తెలిసిందే.
News January 12, 2026
‘మన శంకరవరప్రసాద్ గారు’ పబ్లిక్ టాక్

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ ప్రీమియర్స్ ప్రారంభమయ్యాయి. చిరు ఎంట్రీ అదిరిపోయిందని, ఫస్ట్ ఫైట్ వింటేజ్ మెగాస్టార్‌ను గుర్తు చేస్తుందని ఆడియన్స్ చెబుతున్నారు. కామెడీ బాగుందని, అనిల్ రావిపూడి రెగ్యులర్ స్టైల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆకట్టుకుందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కొన్ని చోట్ల రొటీన్, సాగదీత సీన్లు ఉన్నాయంటున్నారు. రేపు ఉదయం Way2Newsలో ఫుల్ రివ్యూ&రేటింగ్.


