News December 15, 2025
యాదాద్రి: ‘ఎన్నికల డ్యూటీ ట్రైనింగ్ డబ్బులివ్వాలి’

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల డ్యూటీ అలాట్ అయిన సిబ్బందికి రెండు రోజుల ట్రైనింగ్ డబ్బులు ఇవ్వలేదని పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి దేశ ఎన్నికల్లో ప్రొసైడింగ్ ఆఫీసర్‌గా డ్యూటీ అలాట్ కాకుండా 2nd ఫేజ్ అలర్ట్ అయిన వారికి డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు. బీబీనగర్, భూదాన్ పోచంపల్లి, భువనగిరి, వలిగొండ మండల వారికి న్యాయం చేయాలని Way2News ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు.
Similar News
News January 18, 2026
ADB: వేడెక్కనున్న బల్దియా పోరు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మున్సిపాలిటీల్లో వార్డులు, ఛైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్లు శనివారం ఖరారు చేశారు. 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రొటేషన్ పద్ధతిలో స్థానాలను కేటాయించారు. ముఖ్యంగా 50 శాతం స్థానాలు మహిళలకు దక్కడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. రిజర్వేషన్లపై ఎట్టకేలకు స్పష్టత రావడంతో ఆశావహులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
News January 18, 2026
నిర్మల్: రేపటి నుంచి సర్పంచ్‌లకు శిక్షణ

జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు పంచాయతీరాజ్ చట్టం, అధికారాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం శిక్షణ కార్యక్రమాలు చేపట్టింది. బాసర IIIT, నిర్మల్ DMSVK కేంద్రాల్లో జనవరి 19 నుంచి FEB 20 వరకు నాలుగు విడతల్లో ఈ శిక్షణ జరుగుతుంది. కేటాయించిన తేదీల్లో మండలాల వారీగా సర్పంచ్‌లు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల అభివృద్ధి, పాలనపై ఈ సందర్భంగా అవగాహన కల్పించనున్నారు.
News January 18, 2026
రూ.300కోట్ల దిశగా MSVPG కలెక్షన్స్

చిరంజీవి, నయనతార జంటగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.261కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ మూవీలో చిరంజీవి కామెడీ టైమింగ్, వెంకటేశ్ క్యామియో, అనిల్ రావిపూడి డైరెక్షన్, భీమ్స్ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మీరు ఈ సినిమా చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.


