News December 15, 2025

KMR: మరో మూడు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు

image

కామారెడ్డి జిల్లాలో గత మూడు రోజులుగా చలి తీవ్రత కనిష్ఠానికి నమోదయ్యి, చలి తీవ్రత స్థిరంగా ఉంది. అయితే మరో మూడు రోజుల పాటు జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 9 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యి, చలి తీవ్రత మరింత పెరుగుతుందని అంచనా వేసింది. చలి ప్రభావం పెరగనుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News January 13, 2026

మేడారం: భక్తులకు ఇబ్బంది ఉండొద్దని ప్రభుత్వ లక్ష్యం!

image

మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకూడదన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రులు సీతక్క, లక్ష్మణ్ అన్నారు. భక్తులు సులభంగా గమ్యానికి చేరుకునేలా ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాల్లో స్పష్టమైన దిశా, సూచికలు, బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి అయోమయం లేకుండా ట్రాఫిక్ నియంత్రణ పరిష్కారం ఉండాలన్నారు. ప్రత్యేక రూట్ మ్యాప్‌లతో అవసరమైన చోట వన్వే వ్యవస్థ అమలు చేయాలన్నారు.

News January 13, 2026

మేడారంలో మాస్టర్ కంట్రోల్ రూమ్!

image

మేడారం భక్తుల సేవ కోసం జిల్లా యంత్రాంగం మేడారంలో మాస్టర్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈనెల 15 నుంచి అందుబాటులోకి రానుంది. జాతరకు వచ్చిన భక్తులకు ఏవిధమైన సమస్య ఎదురైనా సహాయం, ఫిర్యాదు కోసం నాలుగు మొబైల్ నంబర్లు, ఓ ల్యాండ్ లైన్ ఫోన్‌ను ఏర్పాటు చేశారు. 24/7ఈ నంబర్లు పని చేస్తాయి. ఒక్క ఫోన్ కాల్‌తో సమస్య పరిష్కారం, సహాయం అందించేందుకు అధికారులు సహకరిస్తారు.

News January 13, 2026

త్వరలో 10వేల పోస్టుల భర్తీ: మంత్రి దామోదర

image

TG: త్వరలోనే ఆరోగ్యశాఖలో 10వేల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. HYD కోటీలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో 1,257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు అందజేశారు. ఇప్పటివరకు ఆరోగ్యశాఖలో 9,572 పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. జంట నగరాల్లో 145 పాలిక్లినిక్‌లు, రాష్ట్రంలో 80 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. పేదల ఆరోగ్యభద్రత ప్రభుత్వ బాధ్యత అన్నారు.