News December 15, 2025
విజయ్ హజారే ట్రోఫీ అందరూ ఆడాల్సిందే: BCCI

డిసెంబరు 24 నుంచి ప్రారంభంకానున్న విజయ్ హజారే ట్రోఫీలో జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ తప్పనిసరిగా పాల్గొనాలని BCCI స్పష్టం చేసింది. కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం కోహ్లీ, రోహిత్‌లకి మాత్రమే కాకుండా అందరికీ వర్తిస్తుందని తెలిపింది. దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. గాయాలతో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్‌కు మినహాయింపు ఉంది.
Similar News
News January 15, 2026
ఎర్రవెల్లి నివాసంలో KCR సంక్రాంతి వేడుకలు

TG: ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకలు నిర్వహించుకున్నారు. కుమారుడు కేటీఆర్ కూడా ఫ్యామిలీతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఫాంహౌజ్‌లో రంగు రంగుల ముగ్గు ముందు కేసీఆర్‌తో కలిసి దిగిన ఫొటోలను KTR Xలో షేర్ చేశారు. తమ కుటుంబసభ్యుల తరఫున రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సంక్రాంతి విషెస్ చెప్పారు.
News January 15, 2026
77వ రిపబ్లిక్ డే వేడుకలకు గెస్టులు వీరే

ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు గెస్టుల పేర్లను కేంద్రం ప్రకటించింది. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా(పోర్చుగల్), యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ (జర్మనీ) రానున్నట్లు తెలిపింది. వేడుకల అనంతరం వీరు ఈనెల 27న PM మోదీతో ట్రేడ్ డీల్‌పై చర్చించనున్నారు. కాగా ఈ నెలాఖరున EUతో భారత్ ట్రేడ్ డీల్ సైన్ చేసే అవకాశముందని ట్రేడ్&కామర్స్ సెక్రటరీ రాజేశ్ అగర్వాల్ తెలిపారు.
News January 15, 2026
లోయర్ క్లాస్ జాబ్స్ కాదు బాబాయ్.. అసలైన డిమాండ్ వీరికే..

Ai దెబ్బకు భవిష్యత్‌లో వైట్ కాలర్ జాబ్స్ భారీగా తగ్గిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్లంబర్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్.. లాంటి వృత్తులకు భారీ డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు. వీటిని యువత లోయర్ క్లాస్ ఉద్యోగాలుగా చూస్తోందని, కానీ హై డిమాండ్ దృష్ట్యా వీటికే ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుత రోజుల్లోనే ఓ ప్లంబర్ ఇంటికి వచ్చి చెక్ చేస్తే రూ.500 తీసుకుంటున్నాడని గుర్తు చేస్తున్నారు. COMMENT?


