News April 20, 2024
HYD: 9 మేకులు మింగిన ఖైదీ

చర్లపల్లి జైలు ఖైదీ మహ్మద్ షేక్ (32) ఇనుప మేకులు మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ప్రాణాపాయస్థితిలో 4 రోజుల క్రితం గాంధీ ఆస్పత్రి ప్రిజనర్స్ వార్డులో చేరాడు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కడుపులో మేకులు ఉన్నట్లు గుర్తించారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ HOD ప్రొ.శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యులు ఎండోస్కోపీ ద్వారా 9 మేకులను బయటకు తీసి ప్రాణాలు కాపాడారు.
Similar News
News March 18, 2026
మూసీ ప్రక్షాళన: ఇళ్లు కూల్చకండి.. మురికిని వదలకండి!

ఏళ్లు గడుస్తున్నా మూసీలో మురుగు కంపు తగ్గలేదు కానీ, ప్రచార ఆర్భాటం మాత్రం పెరిగిపోయింది. గత 12 ఏళ్లలో నిధుల కేటాయింపులు కాగితాలకే పరిమితమయ్యాయని హైదరాబాద్ సిటిజన్ ఫోరం గళమెత్తింది. సుందరీకరణ పేరుతో వేలాది ఇళ్లను కూల్చడం సరికాదని, బఫర్ జోన్ సాకుతో పేదలను రోడ్డున పడేయొద్దని డిమాండ్ చేస్తోంది. అభివృద్ధి అంటే ఇళ్లు కూల్చడం కాదు, నదిని శుద్ధి చేయడం అని ఫోరం స్పష్టం చేసింది.

HYD: రీల్స్‌లో బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారా.. జాగ్రత్త!

SM వేదికగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సెక్యూరిటీ గార్డు వెంకన్నను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఒక ప్రముఖ వార్తా సంస్థకు చెందిన సోషల్ మీడియా ‘రీల్’ కింద ఇతడు అత్యంత అసభ్యకరమైన కామెంట్ చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ PSకి తరలించి విచారణ చేస్తున్నారు.