News December 16, 2025
త్రివిక్రమ్.. కెరీర్‌లో తొలిసారి!

త్రివిక్రమ్ తన జోనర్ మార్చినట్లు టీటౌన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సరదా సినిమాలతో సందడి చేసే ఆయన కెరీర్‌లో తొలిసారి థ్రిల్లర్ కథను ఎంచుకున్నారని చెబుతున్నాయి. వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం’ అనే మూవీ పట్టాలెక్కగా ఇటీవల పోస్టర్ సైతం విడుదలైంది. ఈ చిత్రం క్యాప్షన్ AK47 ఫాంట్ స్టైల్ రక్తపు మరకలతో ఉండటం చూస్తే థ్రిల్లర్ మూవీగా స్పష్టమవుతోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Similar News
News March 7, 2026
ఈ కలర్ క్లాత్స్‌తో సమ్మర్‌లో హాయ్ హాయ్..!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం వేళ ఇళ్ల నుంచి బయటికి వెళ్లేవారు కొన్ని రంగుల దుస్తులకు ప్రయారిటీ ఇస్తే శరీరం చల్లగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తెలుపు, లైట్ బ్లూ, లైట్ గ్రే, సాఫ్ట్ పింక్, పేల్ గ్రీన్, లావెండర్, పౌడర్ బ్లూ, క్రీమ్ తదితర రంగుల దుస్తులు వాడాలని సూచిస్తున్నారు. ఇవి సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేసి తక్కువ వేడిని గ్రహిస్తాయి. అలాగే చెమటను త్వరగా ఆరేలా చేస్తాయి.
News March 7, 2026
త్వరలో ఎన్నికలు.. నిరుద్యోగులకు ₹1,500

త్వరలో అసెంబ్లీ ఎన్నికల వేళ WB CM మమతా బెనర్జీ నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్ చెప్పారు. 10వ తరగతి పాసై ఖాళీగా ఉన్న 21 నుంచి 40 ఏళ్ల లోపు యువతీ యువకులకు నెలకు ₹1,500 చొప్పున భృతి ఇస్తామని ప్రకటించారు. మార్చి 7 నుంచే అమలు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు కోటి మందికి ఈ పథకం కింద ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 40% తగ్గిందని, లక్షలాది మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని ఆమె పేర్కొన్నారు.
News March 7, 2026
క్వాంటం కంప్యూటింగ్‌తో అనేక మార్పులు: CM

AP: క్వాంటం కంప్యూటింగ్, AIలకు ప్రపంచ కేంద్రంగా ఎదగాలనేదే ఏపీ లక్ష్యమని CM చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్, AI కోసం $15Bn ఇన్వెస్ట్ చేస్తోందన్నారు. ఢిల్లీలో జరిగిన ‘రైసినా డైలాగ్’ సదస్సులో సాంకేతికత-సుపరిపాలన అంశంపై ఆయన మాట్లాడారు. ‘అమరావతిలో ఏర్పాటుచేసే క్వాంటం కంప్యూటింగ్‌తో అనేక మార్పులు వస్తాయి. భవిష్యత్తులో ప్రజలు క్వాంటం వ్యాలీ గురించి మాట్లాడుకుంటారు’ అని పేర్కొన్నారు.


