News December 16, 2025

‘మిస్‌ ఆంధ్ర’ రన్నరప్‌గా అమలాపురం కమిషనర్ కుమార్తె

image

అమలాపురం మున్సిపల్ కమిషనర్ కుమార్తె వడాలశెట్టి కోమల సాయి అక్షయ ‘మిస్‌ ఆంధ్ర’ రన్నరప్‌గా నిలిచారు. విజయవాడలో ఈనెల 12న నిర్వహించిన రాష్ట్ర స్థాయి అందాల పోటీల్లో ఆమె ఈ ఘనత సాధించినట్లు కమిషనర్ సోమవారం తెలిపారు. అక్షయ ప్రస్తుతం బీబీఏ ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఆన్‌లైన్‌ ఆడిషన్స్‌లో ఎంపికై, తుది పోటీల్లో సత్తా చాటిన అక్షయను పలువురు అభినందించారు.

Similar News

News January 17, 2026

రూ.13 వేల కోట్ల ప్రాజెక్ట్.. నేడే శంకుస్థాపన

image

AP: రాష్ట్రంలో రూ.13,000 కోట్ల పెట్టుబడితో 495 ఎకరాల్లో కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుకి నేడు CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంట్‌ ద్వారా 2,600 మందికి ఉపాధి దక్కనుంది. దీనిని AM గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తుండగా ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్ను గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కానుంది.

News January 17, 2026

WCలో బంగ్లాదేశ్.. నేడు క్లారిటీ

image

T20 WCలో బంగ్లాదేశ్ జట్టు పాల్గొనడంపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు <<18871702>>ఐసీసీ<<>> రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. భద్రతా కారణాలతో ముంబై, కోల్‌కతాలో తమ మ్యాచ్‌లు నిర్వహించవద్దని BCB కోరుతోంది. ఈ నేపథ్యంలో ICCకి చెందిన ఇద్దరు అధికారులు నేడు ఢాకాలో పర్యటించి BCB ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. దీంతో ఈ విషయంలో నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

News January 17, 2026

HYD: ఈ వారం టన్నెల్ ప్లాన్ ఖరారు

image

జేబీఎస్-శామీర్‌పేట కారిడార్‌లో భాగంగా హకీంపేట వద్ద 1.6 కిలోమీటర్ల మేర మెట్రోను అండర్ గ్రౌండ్‌లో నిర్మించాలని ఈ వారంలోనే ప్రభుత్వం పక్కాగా ఓకే చేసింది. రక్షణ శాఖ నిబంధనల ప్రకారం భారీ బడ్జెట్‌తో ఈ టన్నెల్ ప్లాన్ ఫైనల్ అయ్యింది. వచ్చే నెలలో ఇక్కడ మట్టి పరీక్షలు, టన్నెల్ మిషన్ల కోసం సర్వే మొదలు కానుంది. హకీంపేట రన్‌వే దగ్గర మెట్రో పిల్లర్లు కనిపించవు. మెట్రోకున్న అతిపెద్ద అడ్డంకి <<18874553>>క్లియర్<<>> అయిపోయింది.