News December 16, 2025
శ్రీకాకుళం: 3 ఏళ్ల నిరీక్షణకు.. నేటితో తెర..!

కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022 నవంబర్‌లో విడుదలై నేటికీ దాదాపు 3 సంవత్సరాలు పూర్తయింది. ప్రభుత్వం కోర్టు కేసులు పరిష్కరించి అర్హత గల కానిస్టేబుల్ అభ్యర్థుల జాబితాను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన వారికి నేడు మంగళగిరిలోని జరిగే కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి బస్సుల్లో మంగళగిరి చేరుకున్నారు.
Similar News
News January 20, 2026
ఏప్రిల్ 20న సింహాచలం చందనోత్సవం

సింహాచలంలో ఏప్రిల్ 20న జరగనున్న లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం ఏర్పాట్లపై ప్రాథమిక సమీక్ష జరిగింది. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మంగళవారం విశాఖ కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ, సీపీ, జీవీఎంసీ కమిషనర్, దేవస్థానం ఈవో ఉన్నారు.
News January 20, 2026
SKLM: స్వర్ణంతో బియ్యపు గింజంత రథసప్తమి లోగో

రథసప్తమి ఉత్సవాలను పురస్కరించుకుని ఉదయించే సూర్యుడుని స్వర్ణంపై ఆవిష్కరించారు పలాస (M) కాశీబుగ్గకు చెందిన సూక్ష్మ కళాకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి. రథసప్తమి అనే అక్షరాలను ఇందులో పొందిపరిచి ఆకట్టుకుంటున్నారు. ఈ లోగోను ఆదిత్యునికి బహుమతిగా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ లోగో 100 మిల్లీ గ్రాముల బంగారం రేకుపై 5 గంటలు శ్రమించి తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు.
News January 20, 2026
శ్రీకాకుళం: పక్షి ఈకపై ఆదిత్యుడి చిత్రం

శ్రీకాకుళంలోని జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మకళా చిత్రకారుడు వాడాడ రాహూల్ పక్షి ఈకపై ఆరోగ్య భాస్కరుడు సూర్యనారాయణ స్వామి చిత్రాన్ని గీశారు. రథసప్తమి పండుగ సందర్భంగా రథంపై ఆదిత్యుని చిత్రం గీసినట్లు వెల్లడించారు. సూర్యుడి రథాన్ని లాగే ఏడు గుర్రాలలో ఒకదానికి అంకితం చేస్తూ ఈ చిత్రాన్ని గీశామన్నారు. ఇది చూపురాలను ఆకట్టుకుంటోంది.


