News December 16, 2025

నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు

image

కృష్ణా జిల్లా పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఆధార్ ప్రత్యేక క్యాంపులు మంగళవారం నుంచి నిర్వహించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. నవంబర్‌లో నిర్వహించిన క్యాంపుల కొనసాగింపుగా ఈ నెల 16 నుంచి 20 వరకు, అలాగే 22 నుంచి 24 వరకు క్యాంపులు జరుగుతాయని పేర్కొంది. బయోమెట్రిక్ అప్‌డేట్ మిగిలి ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.

Similar News

News January 12, 2026

కృష్ణా: రికార్డు స్థాయి పందేం ఇదే.. అందరి నోట ఒక్కటే మాట!

image

కోడి పందేల చరిత్రలో రికార్డు స్థాయి పందేలు సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో సీసలి బరిలో జరిగిన రూ. 25 లక్షల పందెం ఒక ఎత్తైతే, తాడేపల్లిగూడెంలో ఏకంగా రూ. 1.25 కోట్ల పందేం జరగడం పందెం రాయుళ్లను విస్మయానికి గురిచేసింది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ప్రభాకర్ ఈ భారీ పందేంలో నెగ్గి చరిత్ర సృష్టించారు. దీంతో ఈ ప్రాంతంలో పందేలకు క్రేజ్ అమాంతం పెరిగింది.

News January 12, 2026

మచిలీపట్నంలో మీకోసం కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని ఆయన సూచించారు.