News April 21, 2024
మెదక్: ఎంపీ ఎన్నికల్లో పటాన్చెరు సెగ్మెంట్ ఓటర్లే కీలకం

మెదక్ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థుల గెలుపోటములపై పటాన్చెరు అసెంబ్లీ సెగ్మెంట్ ప్రభావం చూపనుంది. జనవరిలో విడుదల చేసిన ఓటర్ జాబితా ప్రకారం పటాన్చెరు సెగ్మెంట్లో 4,10,170 ఓటర్లు ఉన్నారు. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ ఓటర్లే అధికం అభ్యర్థి గెలుపోటములు ఈ సెగ్మెంట్ కీలకం కానుంది. ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో వలస కార్మికులు అధికంగా నివసిస్తుంటారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇక్కడ ఫోకస్ పెట్టారు.
Similar News
News September 11, 2025
మెదక్: మొత్తం ఓటర్లు= 5,23,327 మంది

మెదక్ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్క తేలింది. బుధవారం సాయంత్రం తుది జాబితా ప్రకటించారు. 21 జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలుండగా 1052 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జడ్పీ సీఈఓ ఎల్లయ్య వెల్లడించారు. జిల్లాలో 2,51,532 మంది పురుషులు, 2,71,787 మంది మహిళలు, 8 మంది ఇతరులు ఉన్నారని, మొత్తం 5,23,327 మంది ఓటర్లున్నారని వివరించారు.
News September 11, 2025
మెదక్: బోధనా నాణ్యత పెరగాలి: కలెక్టర్

మెదక్ జిల్లా కేంద్రంలోని వెస్లీ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి FLN, TLM బోధన అభ్యసన మేళాను కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం ప్రారంభించారు. ఉపాధ్యాయుల సృజనాత్మకతను ప్రోత్సహించడం, తరగతి గదుల్లో బోధనా నాణ్యతను మెరుగుపరచడం కోసమే బోధన అభ్యసన మేళాను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ మేళాలో 21 మండలాల నుంచి 1-5 తరగతుల ఉపాధ్యాయులు పాల్గొనగా ఎనిమిది మంది టీచర్స్ రాష్ట్రస్థాయి మేళాకు ఎంపికయ్యారు.
News September 10, 2025
కళా నైపుణ్యాలను వెలికితీయడానికే కళా ఉత్సవ్: డీఈవో

విద్యార్థుల్లో దాగి ఉన్న కళానైపుణ్యతను వెలికితీయడానికే ఉద్దేశంతోనే కళా ఉత్సవ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి (డీఈవో) ప్రొఫెసర్ రాధాకిషన్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కళా ఉత్సవ్ ప్రారంభించారు. డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులలో కళా నైపుణ్యాలను వెలికితీసేందుకు కళా ఉత్సవ్ పోటీలు ఉపయోగ పడతాయని పేర్కొన్నారు.