News December 16, 2025
పల్నాడు: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

సత్తెనపల్లి బోయ కాలనీలోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. కొన్ని రోజులుగా ఈ గృహంలో వ్యభిచారం జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. వ్యభిచార గృహ నిర్వాహకురాలితో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News January 12, 2026
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల విజేతలు వీరే..

లాస్ ఏంజెలెస్‌లో 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరుగుతోంది. బెస్ట్ యాక్టర్-తిమోతీ చలామెట్(మార్టీ సుప్రీం), బెస్ట్ డైరెక్టర్-పాల్ థామస్ అండర్సన్(వన్ బాటిల్ ఆఫ్టర్ అనెదర్), బెస్ట్ సినిమాటిక్ & బాక్సాఫీస్ అచీవ్‌మెంట్-(సిన్నర్స్), బెస్ట్ యానిమేటెడ్ మోషన్ పిక్చర్-KPop డెమన్ హంటర్స్, బెస్ట్ ఫీమేల్ యాక్టర్-రోజ్ బిర్నే(If I Had Legs I’d Kick You) అవార్డులు గెలుచుకున్నారు.
News January 12, 2026
కృష్ణా జిల్లాలో 189 కి.మీ. మేర ORR.. మారనున్న ముఖచిత్రం!

అమరావతి ORRతో కృష్ణా జిల్లా రూపురేఖలు మారనున్నాయి. పామర్రు, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాలు, గ్రామాల మీదుగా 189.4 కిలోమీటర్ల 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ ORR నిర్మాణానికి కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రూ. 16,310 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. భూ సేకరణపై రైతుల నుంచి 21 రోజుల్లో అభ్యంతరాలు స్వీకరిస్తుండగా, ఈ నెల 16తో గడువు ముగియనుంది.
News January 12, 2026
శ్రీకాకుళం: జనరల్ బోగీలతో ప్రత్యేక రైలు..ఈ నెల18 వరకే ఛాన్స్

సంక్రాతి వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల12-18 వరకు జనసాధారణ్ స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు వాల్టేర్ డివిజన్ సీనియర్ డీసీ పవన్ కుమార్ నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖ-విజయవాడ(08567-68) ట్రైన్ విశాఖలో ఉదయం 10గం.లకు బయలుదేరి సాయంత్రం 4గం.టలకు విజయవాడకు చేరుకుంటుంది. విజయవాడ-విశాఖ మధ్య సాయంత్రం 6.30. గంలకు ప్రారంభమై అర్ధరాత్రి12.30 గం.ల వరకు నడవనుంది.


