News December 16, 2025

అన్నమయ్య జిల్లాకు జోన్-5 కేటాయింపు

image

APలోని 26 జిల్లాలను జోన్‌‌ల వారీగా విభజించే క్రమంలో అన్నమయ్య జిల్లాను జోన్-5 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలకు మల్టీ జోన్-2లో జోన్-5గా చోటుదక్కింది.

Similar News

News January 11, 2026

కోహ్లీ సెంచరీ మిస్

image

స్టార్ క్రికెటర్ కోహ్లీ త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నారు. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో 91 బంతుల్లో 93 పరుగులు చేసి ఔటయ్యారు. జెమీసన్ బౌలింగ్‌లో బ్రేస్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. దీంతో కింగ్ నుంచి మరో సెంచరీ చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. విరాట్ ఔటయ్యే సమయానికి భారత్ స్కోర్ 234/3. టీమ్ ఇండియా విజయానికి 64 బంతుల్లో 67 రన్స్ అవసరం.

News January 11, 2026

గుమ్మానికి ఎదురుగా మరో గుమ్మం ఉండవచ్చా?

image

ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా మరో గుమ్మం ఉండటం శుభప్రదమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇలా ఉంటే గదులు, హాల్స్‌ను క్రమబద్ధంగా వినియోగించుకోవడానికి వీలవుతుందని చెబుతున్నారు. ‘దీనివల్ల ఇంటి లోపల శక్తి ప్రసరణ సాఫీగా జరిగి, కుటుంబీకుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇల్లు చూసేందుకు అందంగా, అమరికగా కనిపిస్తుంది. ఈ నియమాన్ని పాటిస్తే గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News January 11, 2026

మేడారంలో నో సిగ్నల్స్.. భక్తుల అసహనం

image

మేడారం మహా జాతరలో సిగ్నల్స్ లేక అవస్థలు తప్పడం లేదు. జాతర మొదలుకాక ముందే సిగ్నల్ అందక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో మొబైల్ సిగ్నల్‌పై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఫోన్లు కలవకపోవడం లేదని, ఇంటర్నెట్ పనిచేయడం లేదని వాపోతున్నారు. మరి కొద్ది రోజుల్లో జాతర ఉండగా ఇప్పుడే సిగ్నల్ కష్టాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు.