News December 16, 2025

కేసీఆర్ మీటింగ్ వాయిదా

image

TG: ఈ నెల 19న KCR అధ్యక్షతన జరగాల్సిన BRSLP సమావేశం వాయిదా పడింది. ఈ మీటింగ్‌ను 21వ తేదీన నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. 19న పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో BRS MPలు కూడా ఈ భేటీలో పాల్గొనాలనే ఉద్దేశంతో వాయిదా వేశామని తెలిపారు. ఈ మీటింగ్‌లో కృష్ణా-గోదావరి నదులపై BRS సర్కార్ పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై చర్చిస్తారని సమాచారం.

Similar News

News January 21, 2026

బెంగళూరులో RCB మ్యాచులు ఉండవా?

image

కర్ణాటక ప్రభుత్వ <<18883529>>షరతుల<<>> నేపథ్యంలో బెంగళూరులో మ్యాచుల నిర్వహణకు RCB వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. 5 మ్యాచులు ముంబైలో, 2 రాయ్‌పూర్‌లో నిర్వహించాలని భావిస్తోందని సమాచారం. ఈ క్రమంలో తమ హోం గ్రౌండ్‌లో మ్యాచ్‌ల నిర్వహణపై ఈ నెల 27లోగా తెలియజేయాలని RCBకి BCCI చెప్పినట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి. తమిళనాడు, అస్సాం, బెంగాల్ ఎన్నికల డేట్ల ప్రకటన తర్వాతే IPL షెడ్యూల్ విడుదల కావొచ్చని తెలిపాయి.

News January 21, 2026

భూముల మార్కెట్ విలువలు పెంపు!

image

AP: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో భూముల <<13263246>>మార్కెట్ విలువలు<<>> పెరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి సవరించిన కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలోనూ అన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువలు పెంచింది. <<7981895>>గతేడాది<<>> కొత్త జిల్లా కేంద్రాలు, వాణిజ్య ప్రాంతాల్లో 15-25% పెరిగాయి. దీంతో ప్రభుత్వానికి నవంబర్ వరకు ₹7 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఎంత మేర పెంచుతారనే దానిపై త్వరలో క్లారిటీ రానుంది.

News January 21, 2026

రాష్ట్రంలో 220 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

ఏపీ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి పీజీ (MD/MS/DNB/DrNB/DM/MCh) ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.68,900-రూ.2,05,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://apchfw.ap.gov.in * మరిన్ని ఉద్యోగాల కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.