News December 16, 2025

NRPT: ఈనెల 18న T-20 లీగ్ క్రికెట్ జట్టు ఎంపికలు

image

నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఈనెల 18న MDCA, జీ వెంకటస్వామి కాక మెమోరియల్, HCA ఆధ్వర్యంలో T-20 క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ ఇన్‌ఛార్జ్ రమణ “Way2News” ప్రతినిధితో తెలిపారు. ఆసక్తి గల జిల్లా క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డు, 2 ఫొటోలతో ఉదయం 9 గంటలలోపు హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాలకు 91007 53683 చరవాణికు సంప్రదించాలన్నారు.
అవసరమైన వారికి SHARE IT.

Similar News

News January 3, 2026

GHMC కీలక నిర్ణయం.. బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో మార్పు

image

GHMC కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సహాయ వైద్యాధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో మార్పులు తీసుకొచ్చారు. ఇకపై ఈ సర్టిఫికెట్లు సహాయ మున్సిపల్ కమిషనర్ల ద్వారా జారీ చేయనున్నట్లు GHMC కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఈ నిర్ణయంతో పరిపాలనా సమన్వయం మెరుగుపడడంతో పాటు ప్రజలకు సేవలు మరింత వేగంగా అందనున్నాయని పేర్కొంది.

News January 3, 2026

ఐఐటీ ఢిల్లీలో అప్రెంటిస్ పోస్టులు

image

<>ఐఐటీ<<>> ఢిల్లీ 29 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, డిప్లొమా అర్హత గల వారు JAN 19 వరకు అప్లై చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, ఐఐటీ హాస్పిటల్, ఎస్టేట్& వర్క్స్, హాస్టల్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.15వేలు, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.12వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: home.iitd.ac.in/

News January 3, 2026

ASF జిల్లా సర్పంచులకు శిక్షణ

image

ఆసిఫాబాద్ జిల్లాలోని సర్పంచులకు 2026 సంవత్సరానికి సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించన్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. జనవరి 6 నుంచి 12వ తేదీ వరకు యోగా, కళా మేళా, మానసిక శిక్షణ, పర్యటన, లక్ష్యసాధన, సేవా భావం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సర్పంచులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.