News December 16, 2025

విజయనగరం ఆర్టీసీ ఈడీగా మాధవీలత బాధ్యతల స్వీకారం

image

విజయవాడ ఆర్టీసీ మార్కెటింగ్ విభాగం నుంచి పదోన్నతి పొందిన మాధవీలత.. విజయనగరం రీజినల్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె రీజినల్ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొరను కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రీజినల్‌లో ఉన్న బస్సుల కొరత, ప్రయాణికుల ఇబ్బందులు, కార్మికులు, సిబ్బంది సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు.

Similar News

News January 21, 2026

చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి జాతర తేదీలు ఖరారు..

image

చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర తేదీలు ఖరారయ్యాయి. జాతర వివరాలు..
➱ఫిబ్రవరి 22న (ఆదివారం) జాతర ప్రారంభం
➱23న (సోమవారం) పసుపు, కుంకుమ ముర్రాటలతో మొక్కుబడులు చెల్లింపులు
➱24న మంగళవారం రాత్రి గుడిలోకి ఘటాలు రావడంతో జాతర ముగుస్తుంది.
వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

News January 21, 2026

ఆపదలో ఉన్నాం.. డబ్బులు పంపించండి అంటూ కాల్స్: VZM ఎస్పీ

image

ఆపదలో ఉన్నామని చెప్పి ఫోన్ చేసి డబ్బులు వసూలు చేసే కొత్త తరహా మోసాలు పెరుగుతున్నాయని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. ప్రయాణంలో బ్యాగులు పోయాయని, మహిళలు, పిల్లల పేరుతో సహాయం కోరుతూ ఫోన్‌పే, గూగుల్‌పే స్కానర్లు పంపి మోసం చేస్తున్నారని ఆయన బుధవారం తెలిపారు. ఇలాంటి కాల్స్ వస్తే డబ్బులు పంపేముందు తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని, అనుమానం ఉంటే వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలని జిల్లా ప్రజలకు సూచించారు.

News January 21, 2026

ప్రజలకు కావాల్సింది దావోస్‌లు కాదు.. కష్టాలు తీరాలి: బొత్స

image

రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనని, కానీ ప్రజలకు అవసరమైనది విదేశీ దావోస్ సమావేశాలు కాదని, సామాన్యుల కష్టాలు తీరే పాలన కావాలని YCP నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద ఆర్గనైజ్డ్‌గా దొంగ మస్టర్లు వేసి రూ.కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా నాశనమవుతోందని, ప్రజల మీద, ప్రజా ప్రతినిధుల మీద పోలీసుల అరాచకమా అని ప్రశ్నించారు.