News December 16, 2025
తెలంగాణ మొత్తం అప్పు ₹4,42,297 కోట్లు

TG: రాష్ట్రం అప్పు మొత్తం ₹4,42,297 కోట్లకు చేరినట్లు RBI తాజా రిపోర్ట్ ప్రకటించింది. ‘2024లో ₹3.93L కోట్లు కాగా 2025 మార్చినాటికి మరో ₹50వేల కోట్లు పెరిగింది. ఇందులో స్టేట్ డెవలప్‌మెంట్ లోన్‌గా ₹3.58L కోట్లు, పవర్ బాండ్లతో ₹7100 CR, NSSF నుంచి ₹3334 CR, నాబార్డు నుంచి ₹5390CR, బ్యాంకుల నుంచి ₹3వేల Cr, కేంద్రం నుంచి ₹14727 CR, PF నుంచి ₹16,700 CR రుణం తీసుకుంది’ అని పేర్కొంది.
Similar News
News January 3, 2026
మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: ఉత్తమ్

TG: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇక గతంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తుంటే BRS ప్రభుత్వం చూస్తూ కూర్చుందని విమర్శించారు. ఏపీ రోజుకు 13 టీఎంసీలు తీసుకెళ్లేలా తమ ప్రాజెక్టును విస్తరించుకుందన్నారు. 34శాతం నీళ్లు చాలని కేసీఆర్, హరీశ్ రావు సంతకాలు చేయడం వల్లే సమస్య తలెత్తిందని చెప్పారు.
News January 3, 2026
గాలి జనార్దన్ రెడ్డి వివాదం.. SP ఆత్మహత్యాయత్నం

కర్ణాటక రాష్ట్రం బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఇటీవల BJP MLA గాలి జనార్దన్‌రెడ్డి, కాంగ్రెస్ MLA నారా భరత్‌రెడ్డి వర్గాల మధ్య <<18737485>>వివాదం<<>> తలెత్తింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసి కాల్పుల వరకు వెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి బాధ్యుడిని చేస్తూ బళ్లారి ఎస్పీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో మనస్తాపానికి గురై ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు.
News January 3, 2026
కోతుల కోసం మిమిక్రీ ఆర్టిస్టులు.. ఢిల్లీ ప్రభుత్వ వింత ప్లాన్!

ఢిల్లీ అసెంబ్లీ పరిసరాల్లో కోతుల బెడద తగ్గించడానికి ప్రభుత్వం ఒక వింత ప్లాన్ వేసింది. వాటిని భయపెట్టడానికి కొండముచ్చుల అరుపులను మిమిక్రీ చేసే వ్యక్తులను పనిలో పెట్టబోతుంది. గతంలో అమలు చేసిన కొండముచ్చుల కటౌట్ల ప్లాన్ వర్కౌట్ కాలేదు. వాటికి కోతులు ఏమాత్రం భయపడకపోవటంతో మిమిక్రీ చేసేవాళ్లను నియమించాలని నిర్ణయించింది. దీనిపై SMలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


