News December 16, 2025
డైరెక్టర్ సుజీత్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన పవర్‌స్టార్

‘OG’ సినిమాతో భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ సుజీత్‌కు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అదిరిపోయే కానుక ఇచ్చారు. దాదాపు రూ. 2 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా అందించారు. దీనిపై సుజీత్ స్పందిస్తూ.. ‘చిన్నప్పటి నుంచి అభిమానిగా ఉన్న నాకు నా ‘OG’ నుంచి లభించిన ఈ ప్రేమ, ప్రోత్సాహం వెలకట్టలేనిది. ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటా’ అని Xలో ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు పంచుకున్నారు.
Similar News
News January 13, 2026
ఇరాన్‌లో రక్తపాతం.. 2,000 మంది మృతి!

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఇప్పటివరకు సుమారు 2,000 మంది మరణించినట్లు సమాచారం. ఈ మరణాలకు ‘ఉగ్రవాదులే’ కారణమని ఇరాన్ అధికారులు ఆరోపిస్తుండగా, భద్రతా దళాల కాల్పుల వల్లే పౌరులు ప్రాణాలు కోల్పోయారని మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. ఇంటర్నెట్ నిలిపివేతతో పూర్తి వివరాలు తెలియడం లేదు. అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది.
News January 13, 2026
సనాతన ధర్మాన్ని తుడిచేయడం అంత ఈజీ కాదు: అమిత్ షా

భారతదేశ సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, ప్రజల విశ్వాసాన్ని తుడిచేయడం అంత సులభం కాదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఆయన మాట్లాడారు. సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు శతాబ్దాలుగా పదే పదే ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. దాడులు చేసిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారని, ఆలయం మాత్రం సాగర తీరంలో సగర్వంగా నిలబడి ఉందని అన్నారు.
News January 13, 2026
2027 ఎన్నికల్లో UP సీఎం అభ్యర్థిగా ప్రియాంక?

INC ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ UP రాజకీయాల్లో మళ్లీ కేంద్రబిందువుగా మారారు. నిన్న ఆమె 54వ పుట్టిన రోజు వేడుకలను పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. BCలను ఆకర్షించేలా పరివర్తన్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని UPCC చేపట్టింది. దీంతో 2027 UP అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ CM అభ్యర్థిగా ప్రియాంక ఉంటారన్న ప్రచారం ఊపందుకుంది. ఆమె నేతృత్వంలో అధికారంలోకి రాగలమని కాంగ్రెస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు.


