News December 16, 2025
సింహాచలం కొండపై HT లైన్‌లకు గ్రీన్ సిగ్నల్

సింహాచలం కొండపై నుంచి NSEL వరకు HT విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఏపీ ట్రాన్స్‌కోకు అనుమతినిచ్చింది. ఈప్రాజెక్టులో భాగంగా దేవస్థాన భూముల్లో 27 టవర్ల లైన్లు వేయాల్సి ఉంది. ఇందుకుగాను వాడుకున్న స్థలానికి పరిహారంగా ట్రాన్స్‌కో ద్వారా దేవస్థానానికి రూ.15కోట్లు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈపనులను వెంటనే పరిశీలించి, అనుమతులు మంజూరు చేయాలని ఆలయ ఈవోను ప్రభుత్వం ఆదేశించింది.
Similar News
News January 20, 2026
సీతమ్మధార తహశీల్దారు కార్యాలయ అధికారులపై చర్యలు

సీతమ్మధార తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై ముగ్గురు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. 2021 జులైలో ఏసీబీ నిర్వహించిన తనిఖీల్లో మీ-సేవా దరఖాస్తులు కారణం లేకుండా తిరస్కరించినట్టు, లంచాలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. అప్పట్లో విధుల్లో ఉన్న MRO జ్ఞానవేణి, డిప్యూటీ తహశీల్దార్ మొహిద్దీన్ జిలానీ, MRI రవికృష్ణలపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం మెమోలు జారీచేసింది.
News January 20, 2026
బంగ్లాదేశ్ జైళ్లలో ఉన్న విజయనగరం మత్స్యకారులకు విముక్తి

బంగ్లాదేశ్ జైళ్లలో గత 3 నెలలుగా బందీగా ఉన్న విజయనగరం(D)కు చెందిన 9 మంది మత్స్యకారులకు త్వరలో విముక్తి లభించనుంది. విశాఖ హర్బర్ నుంచి వేటకు వెళ్లిన ఎంఎం-735 మెకనైజ్డ్ బోటు, ఇంజిన్ చెడిపోవడంతో బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి కొట్టుకుపోయింది. దీంతో ఆ దేశ కోస్ట్ గార్డ్స్, మత్స్యకారులను అరెస్టు చేసింది. ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కృషితో విడుదల సాధ్యమైంది.
News January 20, 2026
స్టార్ హోటళ్లు-రిసార్టులతో విశాఖకు కొత్త మెరుపు

విశాఖలో రూ.1552 కోట్లతో 10 హోటళ్లు, రిసార్టులు నిర్మాణం కానున్నాయి. ఇవి పూర్తిస్థాయిలో ప్రారంభమైతే సుమారు 1500 గదులు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. ఐటిసీ రూ.328 కోట్ల పెట్టుబడులతో హోటల్ ప్రాజెక్టును చేపడుతోంది. అలాగే అన్నవరం బీచ్, విమానాశ్రయానికి సమీప ప్రాంతంలో Oberoi Hotels & Resorts,7-స్టార్ లగ్జరీ రిసార్ట్ & హోటల్ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేస్తోంది. వరుణ్ గ్రూపు కూడా హోటల్ నిర్మిస్తోంది.


