News April 21, 2024

నర్సీపట్నం బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రమౌళి

image

నర్సీపట్నం నియోజకవర్గం బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మసాగరం గ్రామానికి చెందిన జె.చంద్రమౌళిని ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రకటించారు. ఈమెరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. తన మీద నమ్మకం ఉంచి సీటు కేటాయించిన అధినేత రామచంద్ర యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో నామినేషన్ వేస్తానని తెలిపారు.

Similar News

News April 20, 2025

విశాఖ సీపీ కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్

image

విశాఖ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. విశాఖ నగర ప్రజలు లా అండ్ ఆర్డర్,క్రైమ్, దొంగతనాలు, ట్రాఫిక్ సమస్యలు,పలు పోలీస్ సంబంధిత సమస్యలపై రేపు ఉదయం 10 గంటల నుంచి వినతులు సమర్పించవచ్చన్నారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. అయితే అంబేడ్క‌ర్ జయంతి కారణంగా గత సోమవారం పీజిఆర్ఎస్ రద్దు చేసిన విషయం తెలిసిందే.

News April 20, 2025

చందనోత్సవానికి 500 కేజీల చందనం చెక్కలు సిద్ధం

image

ఏప్రిల్ 30న సింహాచలంలో జరగనున్న చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో సుబ్బారావు ఆదివారం తెలిపారు. ఈనెల 24న మొదటి విడత చందనం అరగదీతను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీని కోసం కావాల్సిన 500 కేజీల చందనపు చెక్కలను ఆదివారం సిద్ధం చేశారు. ఈనెల 24 ఉదయం 6:30కు చందనం అరగదీత మొదలవుతుందని, 7:30 తర్వాత దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు.

News April 20, 2025

కార్పొరేటర్లను ప్రలోభపెట్టినట్టు నిరూపించాలి: V.M.R.D.A ఛైర్మన్

image

G.V.M.C.ఎన్నికల్లో కార్పొరేటర్లను ప్రలోభపెట్టినట్టు ఆరోపిస్తున్న వైసీపీ నాయకులు దాన్ని నిరూపించాలని V.M.R.D.A ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ సవాల్ చేశారు. అవిశ్వాసంలో ధర్మబద్ధంగా నెగ్గామన్నారు. గత 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు చేయని అరాచకం లేదని విమర్శించారు.‌ వైసీపీ పాలనలో జీవీఎంసీలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు.‌ ఇకపై జీవీఎంసీని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తామన్నారు.

error: Content is protected !!