News December 16, 2025

మెస్సీ టూర్‌లో ‘బెస్ట్ సెల్ఫీ’.. నెట్టింట ప్రశంసలు!

image

GOAT టూర్‌లో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో ఫొటో దిగేందుకు సెలబ్రిటీలు పోటీ పడగా ఓ స్పెషల్ సెల్ఫీ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పర్యటనలో తమకు రక్షణగా ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్‌కు మెస్సీతో పాటు రోడ్రిగో డిపాల్, సువారెజ్ స్వయంగా కారులో సెల్ఫీ ఇచ్చారు. స్టార్ ప్లేయర్స్ అందరూ నవ్వుతూ ఇచ్చిన ఈ ఫోటోను ‘బెస్ట్ సెల్ఫీ’ అని నెటిజన్లు కొనియాడుతున్నారు. వారి నిరాడంబరతను ప్రశంసిస్తున్నారు.

Similar News

News April 15, 2026

TODAY HEADLINES

image

☛ అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభం
☛ రేపు ఏపీ ఇంటర్ ఫలితాలు
☛ ‘మహిళా బిల్లు’.. జగన్‌కు చంద్రబాబు లేఖ
☛ సీట్లు పెంచకుండా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: రేవంత్
☛ ఎండలు.. ప్రజలు 11AM-3PM వరకు బయటకు రావొద్దు: సీతక్క
☛ బిహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి
☛ ఇరాన్‌తో రెండు రోజుల్లో మరోసారి చర్చలు: ట్రంప్
☛ IPL: KKRపై CSK విజయం

News April 15, 2026

విమానంలో ఫోన్ వాడితే డేంజరా?

image

విమానంలో ప్రయాణికుల ఫోన్లను కచ్చితంగా ఫ్లైట్ మోడ్‌లో పెట్టుకోమంటారు. అలా చేయకపోతే డేంజరనే భయం కొందరిలో ఉంటుంది. అయితే ఫోన్ ఫ్లైట్ మోడ్‌‌లో లేనంత మాత్రాన ప్లేన్ కూలిపోదని, కానీ కొంత రిస్క్ ఉందంటున్నారు పైలట్లు. ‘ఫ్లైట్ మోడ్‌లో లేకుంటే ఫోన్లు సిగ్నల్స్ రాబట్టేందుకు యత్నిస్తాయి. పైలట్ల హెడ్‌సెట్స్‌కు వచ్చే రేడియో వేవ్స్ డిస్ట్రబ్ అయ్యి శబ్దం వస్తుంది. ఫలితంగా ఏకాగ్రత దెబ్బతింటుంది’ అని చెబుతున్నారు.

News April 15, 2026

హార్దిక్ నిర్ణయాలపై రోహిత్ సంతృప్తిగా లేరు: మాజీ క్రికెటర్

image

హార్దిక్ చెత్త నిర్ణయాల వల్లే RCB చేతిలో ముంబై ఓడిపోయిందని మాజీ క్రికెటర్ సడగొప్పన్ రమేశ్ అభిప్రాయపడ్డారు. ‘MIకి హార్దిక్ కెప్టెన్సీనే పెద్ద సమస్య. 7, 8వ ఓవర్లు వరుసగా స్పిన్నర్లకు ఇచ్చాడు. పాటీదార్ ఉన్నప్పుడు ఇలా చేయడం పెద్ద తప్పు. డేవిడ్‌కు హై ఫుల్ టాస్ వేసి DRSకు వెళ్లడంతో సూర్య షాకయ్యాడు. అటు రోహిత్ కూడా హార్దిక్ నిర్ణయాలపై సంతృప్తిగా లేనట్లు క్లియర్‌గా కనిపించింది’ అని తెలిపారు.