News December 16, 2025

హైదరాబాద్‌కు IIM మంజూరు చేయండి: CM

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ (YIIRS) ఏర్పాటుకు సహకరించాలని TG సీఎం రేవంత్ ఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలను కోరారు. 105 YIIRSలు నిర్మిస్తున్నామని, వీటితో 4 లక్షల మందికి మెరుగైన విద్య అందుతుందని తెలిపారు. ఇందుకు రూ.30వేల కోట్ల ఖర్చు అవుతుందని, ఈ మొత్తానికి తీసుకునే రుణాలను FRBM నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. అటు హైదరాబాద్‌కు IIM మంజూరు చేయాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు.

Similar News

News April 15, 2026

రామాయణ తర్వాత సెట్స్‌పైకి ‘బ్రహ్మాస్త్ర 2’!

image

రణ్‌‌బీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర మూవీ సీక్వెల్‌పై నిర్మాత నమిత్ మల్హోత్రా అప్డేట్ ఇచ్చారు. రామాయణ సినిమా పూర్తయ్యాక బ్రహ్మాస్త్ర 2 పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ స్క్రిప్ట్ రెడీ చేశారని సమాచారం. సీక్వెల్ పనులు జరుగుతున్నాయని రణ్‌బీర్ గతంలో చెప్పారు. ప్రస్తుతం గ్లోబల్‌గా రామాయణ ప్రమోషన్స్‌లో మేకర్స్ బిజీగా ఉన్నారు.

News April 15, 2026

యుద్ధం.. 4 పాయింట్లతో చైనా పీస్ ప్లాన్!

image

ఇరాన్, US మరోసారి చర్చలకు యత్నిస్తున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 4 పాయింట్లతో పీస్ ప్లాన్ సూచించారు. ‘పశ్చిమాసియా, గల్ఫ్‌లో సుస్థిర భద్రతా వ్యవస్థ ఏర్పాటుకు దేశాలు బంధాలు మెరుగుపరుచుకోవాలి. దేశాల జాతీయ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి. ఐక్యరాజ్యసమితి కేంద్రంగా అంతర్జాతీయ వ్యవస్థను దృఢంగా నిలబెట్టాలి. అన్ని దేశాలు అభివృద్ధిని భద్రతతో అనుసంధానించాలి. ఇందుకు మేం సాయపడతాం’ అని పేర్కొన్నారు.

News April 15, 2026

GK: తొలి కంప్యూటర్ ప్రోగ్రామర్ ఎవరు?

image

☛ కంప్యూటర్ పితామహుడు-చార్లెస్ బాబేజ్
☛ ఆధునిక కంప్యూటర్ పితామహుడు-అలాన్ ట్యూరింగ్
☛ మొదటి కంప్యూటర్ ప్రోగ్రామర్-అడా లవ్‌లేస్ (ఫొటోలో)
☛ మొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్-ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ (ENIAC)
☛ కంప్యూటర్ మెదడు అని దేనిని పిలుస్తారు-CPU (సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్)
☛ 1024 MB: 1 GB (గిగాబైట్)
☛ 1024 GB: 1 TB (టెరాబైట్)