News December 16, 2025

గ్రీన్‌కు రూ.25.20 కోట్లు

image

IPL మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్రీన్‌ను రూ.25.20 కోట్లకు KKR దక్కించుకుంది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ఇతడి కోసం కేకేఆర్, చెన్నై పోటీ పడ్డాయి. దీంతో IPL వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం గ్రీన్ రూ.18 కోట్లు అందుకోనున్నారు. మిగిలిన మొత్తం వెల్ఫేర్ ఫండ్‌కు వెళ్లనుంది. అటు డేవిడ్ మిల్లర్‌ను రూ.2 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది.

Similar News

News January 16, 2026

కుజ దోషం తగ్గు మొహం పట్టాలంటే…?

image

జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే వివాహ ఆలస్యం, రుణబాధలు, సంతాన సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఆ గ్రహానికి అధి దేవుడైన సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. నిత్యం ‘రుణ విమోచక అంగారక స్తోత్రం’ పఠించడం, మంగళవారం ఎర్రని పుష్పాలతో అంగారకుడిని పూజించడం వల్ల దోషాలు తొలగుతాయి. 9 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయిస్తే వివాహ, ఆర్థిక ఇబ్బందులు తొలగి సకల సంపదలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.

News January 16, 2026

2026లో 1,25,000 కొత్త ఉద్యోగాలు!

image

టెక్ రంగంలో 2026లో ఉద్యోగ నియామకాలు పెరుగుతాయని Adecco India అంచనా వేసింది. క్రితం ఏడాదితో పోలిస్తే రిక్రూట్‌మెంట్ 12-15% పెరగొచ్చని తెలిపింది. వివిధ విభాగాల్లో 1,25,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. IT, IT సర్వీసెస్‌ సెక్టార్లలో స్టెబిలిటీ వచ్చిందని తెలిపింది. AI, క్లౌడ్, సైబర్‌సెక్యూరిటీ, డేటా ప్లాట్‌ఫామ్స్‌కు డిమాండ్ పెరిగినట్లు వెల్లడించింది.

News January 16, 2026

మళ్లీ తగ్గనున్న ఉష్ణోగ్రతలు.. 10 రోజులు జాగ్రత్త!

image

TG: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకున్నాయని ఊపిరి పీల్చుకునేలోపే మళ్లీ చలి తీవ్రత పెరగనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు వెస్ట్ తెలంగాణలో ఇవాళ రాత్రి సగటు ఉష్ణోగ్రతలు 12-14 డిగ్రీలుగా నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. రాబోయే 10 రోజులు ఈ తరహా వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు 29-30 డిగ్రీలుగా ఉంటాయని వెల్లడించారు.