News December 16, 2025

కడప జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ?

image

కడప జిల్లా TDP అధ్యక్షుడి రేసులో ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి, జమ్మలమడుగు TDP ఇన్‌ఛార్జ్ భూపేశ్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తన టికెట్‌ను త్యాగం చేయడం, అలాగే అవినాశ్‌రెడ్డికి గట్టి పోటీ ఇచ్చిన భూపేశ్‌కు పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పగ్గాలు తీసుకొని నడిపించిన వాసునే కొనసాగించాలని ఆయన అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Similar News

News March 13, 2026

వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు: జేసీ నిధి మీనా

image

కడప జిల్లాలో వంట గ్యాస్ బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా హెచ్చరించారు. వంట గ్యాస్ డిమాండ్, సరఫరా, పంపిణీ, కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్ తదితర వాటిపై గురువారం కడపలో జేసీ సంబంధిత అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో సమీక్ష నిర్వహించారు. వంట గ్యాస్ పక్క దారి పట్టకుండా ఏజెన్సీలు డెలివరీ సిబ్బందిపై నిరంతరం పటిష్టమైన నిఘా పెట్టాలన్నారు.

News March 12, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
➤ 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,770
➤ 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,508
➤ వెండి 10 గ్రాముల ధర రూ.2,720.

News March 12, 2026

కడప: రేపు వైవీయూ కాన్వకేషన్ .. ఏర్పాట్లు పూర్తి

image

యోగి వేమన విశ్వవిద్యాలయం కాన్వకేషన్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈ కృష్ణారావు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు లోపు విద్యార్థులు తిరుపతి బైపాస్ రోడ్డులోని డీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌కు చేరుకోవాలన్నారు. రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పట్టాల ప్రదానం జరుగుతుందన్నారు. వీసీ ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్ అధ్యక్షత వహిస్తారని చెప్పారు. ఇద్దరు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్‌ను అందజేస్తామన్నారు.